Breaking News

సిక్కిం వరదల్లో గల్లంతైన టాలీవుడ్ సీనియర్ నటి..!

Published on Sat, 10/07/2023 - 12:28

ఇటీవల సిక్కింలో అనూహ్యంగా సంభవించిన వరదల్లో అలనాటి నటి సరళ కుమారి ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అమెరికాలో ఉంటున్న ఆమె కుమార్తె ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి ఆచూకీని కనిపెట్టాలంటూ  తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

(ఇది చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!) 

1983లో మిస్ ఆంధ్రప్రదేశ్‌గా ఎంపికైన సరళ కుమారి.. ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన దాన వీర శూరకర్ణ, ఆ తర్వాత సంఘర్షణ లాంటి చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని హైటెక్  సిటీ ప్రాంతంలో ఆమె నివాసముంటున్నారు. ఈ నెల అక్టోబరు 2న ఆమె తన మిత్రులతో కలిసి సిక్కిం పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన గురించి అమెరికాలో ఉంటున్న కుమార్తె నబితకు కూడా ఆమె సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సిక్కింలో ఆకస్మాత్తుగా వచ్చిన వరదల తర్వాత సరళ కుమారి ఆచూకీ గల్లంతవ్వడంతో ఆమె కుమార్తె నబిత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అక్టోబరు 3న చివరిసారిగా నేను అమ్మతో మాట్లాడినట్లు నబిత తెలిపింది. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేదని.. వార్తల్లో వరదల గురించి తెలుసుకున్నా.. ఆర్మీ నంబర్లకు ప్రయత్నించినా అవీ కూడా పనిచేయడం లేదు. దయచేసి మా అమ్మను కనిపెట్టండి అంటూ  తెలంగాణ ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా.. ఈశాన్య రాష్ట్రం సిక్కింలో కుంభవృష్టి కారణంగా ఆకస్మిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ వరదల్లో ఆర్మీ జవాన్లు సైతం గల్లంతయ్యారు. 

(ఇది చదవండి: మూగ అమ్మాయితో సినిమాలా?.. నీకేమైనా పిచ్చా అన్నారు: అభినయ తండ్రి ఎమోషనల్!)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)