Breaking News

సంక్రాంతి స్పెషల్.. పండుగ రోజే ఓటీటీకి వచ్చేసిన కొత్త సినిమా!

Published on Tue, 01/14/2025 - 13:35

సంక్రాంతి పండుగ అంటే కేవలం పిండి వంటలే కాదు.. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఉండాలి. కోడి పందేలతో పాటు సినిమాలు కూడా ఎంజాయ్ చేయాలి. ఇప్పటికే థియేటర్లలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు సందడి చేస్తున్నాయి. స్టార్ హీరోల ఫ్యాన్స్ అంతా ఇప్పటికే థియేటర్లకు క్యూ కడుతున్నారు.

మరి ఫ్యామిలీతో ఎంచక్కా ఇంట్లోనే సినిమాలు వీక్షించాలనుకునే వారికి ఓటీటీలు రెడీ బోలెడు ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తున్నాయి. ఇటీవల విడుదలైన సినిమాలతో పాటు మీకిష్టమైన చిత్రాలు చూసేయొచ్చు. అలాంటి వారికోసమే  సంక్రాంతి పండుగ సందర్భంగా ఓటీటీకి వచ్చేసింది తెలుగు సినిమా. అదేంటో మీరు ఓ లుక్కేయండి.

సంక్రాంతి పండుగ రోజున ఓ తెలుగు చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలోకి అడుగుపెట్టేస్తోంది. యంగ్ హీరో తిరువీర్ నటించిన చిత్రం మోక్ష పటం. ఈ సినిమా ఇప్పటి వరకు థియేటర్లలో రిలీజ్ కాలేదు. ఈ సంక్రాంతి ఫెస్టివల్ స్పెషల్‍ నేరుగా ఓటీటీలోనే అడుగుపెట్టింది. ఈ  క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ చిత్రానికి రాహుల్ వనజ రాజేశ్వర్ దర్శకత్వం వహించారు.

ఈ చిత్రంలో పూజా కిరణ్, తరుణ్ పొనుగోటి, జెన్నిఫర్ ఇమ్మూన్యుయేల్, శాంతి రావ్ కీలక పాత్రలు పోషించారు. కామెడీ అండ్ క్రైమ్‍ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు రాజేశ్వర్ తెరకెక్కించారు. ఈ చిత్రానికి రవి గోలీ, లక్ష్మణా, రాహుల్ కథను అందించారు. నేస్తమా మూవీ మేకర్స్ పతాకంపై ప్రవీణ్ గడ్డం, సాయి, తారపరెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు కమ్రాన్ సంగీతమందించారు. 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)