వైరల్ వయ్యారి సాంగ్‌.. హీరోయిన్‌ శ్రీలీలను మించిపోయిన బామ్మ..!

Published on Wed, 07/16/2025 - 21:14

శ్రీలీల సాంగ్‌ చిన్నా పెద్దా లేకుండా అందరిని ఊపేస్తోంది. గతేడాది పుష్ప-2 మూవీలో కిస్సిక్ సాంగ్‌తో అభిమానులను అలరించిన ముద్దుగుమ్మ.. మరోసారి అలాంటి గూస్‌బంప్స్ తెప్పించే పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన లేటేస్ట్‌ మూవీ 'జూనియర్' నుంచి వైరల్ వయ్యారి అంటూ ఇటీవలే లిరికిల్ సాంగ్‌ రిలీజ్‌ చేయగా యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఈ పాటతో మరోసారి మాస్ ఆడియన్స్‌ను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటీ హీరోగా పరిచయమవుతోన్న ఈ సినిమా జూలై 18న థియేటర్లలో సందడి చేయనుంది.

తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌లో వైరల్ వయ్యారి సాంగ్‌ను ప్రదర్శించారు. ఈ పాటకు సీనియర్ నటి, బామ్మ పాత్రలకు ఫేమస్ అయిన మణి తనదైన డ్యాన్స్‌తో అదరగొట్టేసింది. వైరల్ వయ్యారి వేదికపై స్టెప్పులతో ఓ ఊపు ఊపేసింది. పక్కనే యాంకర్ సుమ బామ్మతో కలిసి కాలు కదిపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ బామ్మ ఎనర్జీ వేరే లెవెల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)