Breaking News

ఏఐ మాయ.. ఆ లిస్ట్‌లో మరో హీరోయిన్.. ‍..!

Published on Wed, 12/17/2025 - 20:02

టెక్నాలజీ అనేది మంచి కోసం ఉపయోగించాలి. అదేంటో సాంకేతికత పెరిగేకొద్ది మనిషి బుద్ధి మాత్రం గాడి తప్పుతోంది. మరీ ముఖ్యంగా ఏఐ వచ్చాక విపరీతమైన ధోరణి మరింత పెరిగిపోయింది. ఎవరు పడితే వాళ్లు ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సినీతారలనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. రష్మిక, కాజోల్, కీర్తి సురేశ్ లాంటి స్టార్స్ వీటి బారిన పడిన వారిలో ఉన్నారు.

తాజాగా లిస్ట్‌లో శ్రీలీల కూడా చేరిపోయారు. ఏఐ టెక్నాలజీతో నా ఫోటోలు అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని కన్నడ బ్యూటీ వాపోయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ నోట్‌ షేర్ చేసింది.  ఏఐతో చేస్తున్న చెత్తను ఎవరూ సపోర్ట్ చేయొద్దని చేతులు జోడించి ప్రాధేయపడుతున్నానని తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.

(ఇది చదవండి: శ్రీలీల కూడా 'ఏఐ' బాధితురాలే.. ఆవేదనతో పోస్ట్)

అయితే తాజాగా మరో హీరోయిన్ నివేదా థామస్ సైతం తాను కూడా ఏఐ బాధితురాలినేని ట్వీట్ చేసింది. ఏఐతో తన ఫోటోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చిందని తెలిపింది. నా అనుమతి లేకుండా అలాంటి కంటెంట్‌ సృష్టించడం నన్ను తీవ్రంగా కలిచివేసిందని వెల్లడించింది. ఇది నా వ్యక్తిగత గోప్యతపై జరిగిన దాడి అని నివేదా థామస్ ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే నా ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ఖాతాల నుంచి తీసివేయాలని ఆదేశించింది. ఎవరైనా ఇలాంటి కంటెంట్‌ను గుర్తిస్తే.. వాటిని ఎవరికీ కూడా షేర్ చేయవద్దని నివేదా కోరింది. అనవసరమైన వాటిని షేర్ చేసి ఇబ్బందుల్లో పడొద్దని.. ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగానికి పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని నివేదా థామస్ స్వీట్ వార్నింగ్ ఇచ్చేసింది. 
 

 

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)