Breaking News

టాలీవుడ్‌లో తెలుగమ్మాయిల హవా.. ట్రెండ్‌ మారుతోందా?

Published on Mon, 02/16/2026 - 19:50

టాలీవుడ్‌ సినిమాల్లో హీరోయిన్స్‌గా తెలుగమ్మాయిలు కనిపించడం చాలా అరుదు. అస్సలు తెలుగమ్మాయి హీరోయిన్ అయిందా? అని మనవాళ్లే ఆశ్చర్యపోతుంటారు.  అలాంటి సందర్భాలు గతంలో చాలా చూశాం. టాలీవుడ్‌ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీ అయినప్పటికీ ఇక్కడ కన్నడ భామలదే హవా. వాళ్లతో పాటు కోలీవుడ్ బ్యూటీలు ఎక్కువగా ఛాన్స్ కొట్టేస్తుంటారు. తెలుగమ్మాయిలు హీరోయిన్‌గా కనిపించే సందర్భాలు చాలా అరుదుగానే కనిపించేవి. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ సినిమాల్లో రష్మిక, శ్రీలీల, మీనాక్షి చౌదరి డామినేషన్‌ ఉందన్న వాస్తవాన్ని మనం అంగీకరించాల్సిందే.

కానీ ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. మన తెలుగమ్మాయిలు కూడా గ్లామర్‌లో ఏ మాత్రం తగ్గేదేలే అని నిరూపిస్తున్నారు. గత కొన్నాళ్ల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కథానాయికల విషయంలో మార్పులొస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన మన తెలుగమ్మాయి సైతం వెండితెరపై సత్తా చాటుతున్నారు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌లో మన తెలుగమ్మాయిలు రాణిస్తున్నారు. దాదాపు అరడజన్‌కు పైగా సినిమాలతో బిజీగా అయిపోయారు. ఇంతకీ రష్మిక, శ్రీలీల లాంటి కన్నడ భామలక పోటీగా వస్తోన్న మన తెలుగు హీరోయిన్స్‌ ఎవరో తెలుసుకుందాం.

మానస వారణాసి..

మానస వారణాసి మన తెలుగమ్మాయే. ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మిస్ ఇండియా 2020 కిరీటాన్ని సొంతం చేసుకున్న మానస వారణాసికి తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

శివానీ నాగారం..

తెలుగమ్మాయి శివానీ నాగారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీగా మారిపోయింది. అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌తో మొదలైన జర్నీ మరిన్ని అవకాశాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం సుహాస్ హీరోగా వస్తోన్న హే బల్వంత్ మూవీలో కనిపించనుంది. ఫిబ్రవరి 20న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. లిటిల్ హార్ట్స్‌ మూవీతో యూత్‌ను కట్టిపడేసిన శివానీ నాగారం తెలుగులో మరిన్ని అవకాశాలతో దూసుకెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది.

బేబీ వైష్ణవి చైతన్య..

బేబీ మూవీతో ఫుల్ ఫేమ్ దక్కించుకున్న తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. ఈ మూవీలో తన మాస్‌ నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఆ తర్వాత వైష్ణవి లవ్ మీ ఇఫ్‌ యూ డేర్, సిద్ధు జొన్నలగడ్డతో జాక్‌ మూవీ మెరిసింది.  ప్రస్తుతం వైష్ణవి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఓ ప్రాజెక్ట్‌లో కనిపించనుంది. తెలుగమ్మాయిగా ఎంట్రీ ఇచ్చి వెండితెరపై సత్తా చాటుతోంది.

శ్రీ గౌరి ప్రియ..

మ్యాడ్ ‍బ్యూటీ శ్రీ గౌరిప్రియ కూడా మన తెలుగమ్మాయే. రైటప్ పద్మభూషణ్, లవర్ చిత్రాల్లో హీరోయిన్‌గా మెప్పించింది. యూత్‌లో క్రేజ్ కొట్టేసిన తెలుగు బ్యూటీ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం శ్రీగౌరి ప్రియ వింటారా సరదాగా, చెన్నై లవ్ స్టోరీ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించనుంది.

కోర్ట్ బ్యూటీ శ్రీదేవి..

కోర్ట్ మూవీతో ఓవర్‌నైట్ క్రేజ్ దక్కించుకున్న తెలుగమ్మాయి శ్రీదేవి. ఈ సినిమాతో టాలీవుడ్‌లో ఫేమస్ అయిపోయింది. ఈ మూవీ తర్వాత శ్రీదేవికి అవకాశాలు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్‌లోనే కాదు.. కోలీవుడ్ డైరెక్టర్స్‌ సైతం శ్రీదేవి ఆఫర్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం శ్రీదేవి బ్యాండ్‌మేళం అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాకుండా తమిళంలోనూ ఓ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది.

ఈషా రెబ్బా..

మన వరంగల్‌కు చెందిన తెలుగమ్మాయి ఈషా రెబ్బా. లైఫ్‌ ఈజ్ బ్యూటీఫుల్‌ మూవీలో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత అంతకుముందు.. ఆ తర్వాత అనే చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే తరుణ్ భాస్కర్‌ హీరోగా వచ్చిన ఓ శాంతి శాంతి శాంతిః చిత్రంలో కనిపించింది. తన గ్లామర్‌తో అభిమానులను అలరిస్తోన్న ఈషా రెబ్బా టాలీవుడ్‌లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ ఇండస్ట్రీలోనూ అవకాశాలతో రాణిస్తోంది.

వీరితో పాటు అనన్య నాగళ్ల, చాందిని చౌదరి లాంటి తెలుగమ్మాయిలు టాలీవుడ్‌లో తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాలో తెలుగమ్మాయిల హవా కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇలాగే మనవాళ్లు మరిన్ని అవకాశాలతో ముందుకెళ్లాలని టాలీవుడ్ అభిమానులుగా ఆశిద్దాం. ఈ తెలుగు భామలు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుందాం.
 

Videos

AP: నాగమల్లేశ్వరి అరెస్ట్

విశాఖలో పుష్ప శ్రీ వాణి అరెస్ట్

పోలీసులు ఆపుదాం అని చూసారు ఇచ్చిపడేసిన పుష్ప శ్రీ వాణి

వాళ్లకు నీళ్లు.. మాకు కన్నీళ్లా..? బాబుకు శిల్ప చక్రపాణి వార్నింగ్

బాబు సభ కోసం బెదిరింపులు.. బయటపడ్డ ఆడియో లీక్

'రోడ్డు బాగు చేసే వరకు లేవను'.. నడిరోడ్డుపై భీష్మ ప్రతిజ్ఞ!

అమెరికా హెచ్-1బీ వీసా వ్యవస్థలో, భారత్ కేంద్రంగా బయటపడ్డ మహా కుంభకోణం

కన్నీళ్లు పెట్టుకున్న వైభవ్ బ్యాడ్ టైం అంటే ఇదేరా బుద్దోడా

ఆనం వెనక్కి పో.. నిమ్మల ముందుకు రా వీడియో వైరల్..

YSR పై పాట ఇరగదీసిండు.. ఇది పక్కా ఊరోడి కథ

Photos

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

‘కూర్మావతార్‌’ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)