Breaking News

తెలుగు ప్రేక్షకులంటే మరీ అంత చులకనా?

Published on Wed, 07/23/2025 - 11:25

తెలుగు ప్రేక్షకులకు సినిమాలంటే మహాప్రేమ. భాషతో సంబంధం లేకుండా ఏ మాత్రం బాగున్నా ఏ మూవీనైనా చూసి పడేస్తారు. దీన్ని అలుసుగా తీసుకుంటున్నారో ఏమో గానీ కొందరు దక్షిణాది దర్శకనిర్మాతలు మనోళ్లని మరీ లైట్ తీసుకుంటున్నారే అనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్నాళ్ల నుంచి దాదాపు ఒకేలాంటి తప్పు మళ్లీ మళ్లీ చేస్తున్నారు. ఇంతకీ ఏంటి విషయం?

ఒకప్పుడు ఏ భాషకు చెందిన సినిమా అయినా సరే తెలుగులో డబ్ చేస్తున్నారంటే కనీస జాగ్రత్తలు తీసుకునేవారు. సినిమాలో తమిళ పదాలకు బదులు తెలుగు ఉండేలా చూసుకునేవారు. టైటిల్‌తోపాటు మూవీలోని పాత్రలకు కూడా తెలుగు పేర్లే పెట్టేవారు. గత కొన్నేళ్లలో మాత్రం అలాంటిది అస్సలు పాటించట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే మర్చిపోయారేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలావరకు తమిళ దర్శకనిర్మాతలు యధాతథంగా తమ టైటిల్స్ తెలుగులోనూ అలానే ఉంచేస్తున్నారు. వేట్టయాన్, పొన్నియిన్ సెల్వన్, కంగువ, మార్గన్, తుడరుమ్.. ఇలా చెప్పుకొంటూ పోతే బోలెడు ఉదాహరణలు.

(ఇదీ చదవండి: ఒక రాత్రిలో జరిగే పోలీస్ థ్రిల్లర్.. 'రోంత్' తెలుగు రివ్యూ (ఓటీటీ))

అంతెందుకు ఇప్పుడు సూర్య కొత్త సినిమాకు 'కరుప్పు' టైటిల్ ఫిక్స్ చేశారు. దీనికి తెలుగులో నలుపు అని అర్థం. ఎంత సూర్య అయినా సరే పేరు కాస్త తెలుగులో ఉంటేనే కదా.. మూవీ జనాలకు రీచ్ అవుతుంది. అలా కాదని చెప్పి యధాతథంగా టైటిల్స్ పెట్టుకుంటే పోతే ఇది మనం చూసే సినిమా కాదేమో మనవాళ్లు లైట్ తీసుకునే అవకాశముంది. చూడాలి మరి భవిష్యత్తులోనైనా ఈ తీరు మార్చుకుంటారా లేదా అనేది?

సూర్య పుట్టినరోజు సందర్భంగా 'కరుప్పు' సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఫుల్ ఆన్ యాక్షన్‌తో పాటు మాస్ సీన్స్  బాగానే ఉన్నాయి. వింటేజ్ చిత్రాలైన 'గజిని', 'భాషా' సినిమాల్ని గుర్తుచేసే కొన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయండోయ్. అంతా బాగానే ఉంది గానీ టీజర్‌లోనూ తమిళ ఫ్లేవర్ కాస్త గట్టిగానే కొట్టింది. మరి దీన్ని మన ఆడియెన్స్ ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి? దీపావళికి ఈ సినిమా థియేటర్లలోకి రావొచ్చని టాక్ నడుస్తోంది.

(ఇదీ చదవండి: నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. హీరోయిన్ ఆవేదన)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)