Breaking News

ట్రైలర్‌: సీరియల్స్‌ చూస్తున్నంతసేపు దెయ్యంగా.. కాపాడనున్న సమంత!

Published on Sun, 04/27/2025 - 11:37

హీరోహీరోయిన్లు ఇప్పుడు నిర్మాతగానూ సక్సెస్‌ చూస్తున్నారు. నాని ఇటీవలే నిర్మాతగా కోర్టు మూవీతో విజయం అందుకున్నాడు. తాజాగా హీరోయిన్‌ సమంత (Samantha Ruth Prabhu) కూడా ప్రొడ్యూసర్‌గా సత్తా చూపించేందుకు సిద్ధమైంది. ఆమె కొత్తగా ట్రలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ అనే బ్యానర్‌ను స్థాపించింది. ఈ బ్యానర్‌లో శుభం అనే సినిమా తెరకెక్కింది. కొత్తవారితో కలిసి చేసిన ఈ సినిమాకు ప్రవీణ్‌ కండ్రెగుల దర్శకత్వం వహించాడు.

సీరియల్స్‌ చూస్తున్నంతసేపు ఒంట్లో దెయ్యం
ఆదివారం (ఏప్రిల్‌ 27) నాడు ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో ఆడవాళ్లు సీరియల్స్‌కు బానిసైపోతారు. ఏం చేస్తున్నా సరే సీరియల్‌ టైం అవగానే టీవీ ముందు కూర్చుంటారు. వాళ్లను డిస్టర్బ్‌ చేశారంటే వాళ్ల పని అధోగతే! సీరియల్స్‌ చూస్తున్నప్పుడు వారి శరీరంలోకి ఓ దెయ్యం వచ్చినట్లే ప్రవర్తిస్తున్నారు. దీంతో మగవాళ్లు చివర్లో ఓ మాతను కలుస్తారు. ఇక్కడ మాత స్థానంలో ఉన్నది మరెవరో కాదు సమంత. ఊర్లో ఉన్న మగవాళ్లందరినీ కాపాడమని వాళ్లు ఆమె శరణు కోరతారు.

మే 9న రిలీజ్‌
మరి సమంత ఏం చేసింది? వాళ్లను కాపాడిందా? లేదా? అన్నది తెలియాలంటే మే 9న ఈ సినిమాను థియేటర్లలో చూడాల్సిందే! ఈ విచిత్రమైన కథను చచ్చినట్లు చూడాల్సిందే అని ట్రైలర్‌లోనే నొక్కి చెప్పారు. ఏదేమైనా ఈ మూవీలో సమంతను చూసి అభిమానులు సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేస్తున్న సామ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

 

చదవండి: పిలిస్తే రానన్నానా? అంతేలే.. హర్టయిన రామజోగయ్య శాస్త్రి

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)