Breaking News

ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Published on Fri, 01/23/2026 - 14:00

'ప్రేమమ్' అనే మలయాళ సినిమాతో తెలుగులోనూ కాస్తంత ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో నివీన్ పౌలీ. ఈ చిత్రం తర్వాత యాక్టింగ్ అయితే చేస్తున్నాడు గానీ సరైన హిట్ దొరకలేదు. దాదాపు పదేళ్ల తర్వాత 'సర్వం మాయ'తో అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ హిట్ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

(ఇదీ చదవండి: శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ)

నివీన్ పౌలీ, రియా షిబు, అజు వర్గీస్, ప్రీతి ముకుందన్ తదితరుల ప్రధాన పాత్రల్లో నటించిన 'సర్వం మాయ'.. గత నెల 25న థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్‌తో తెలుగు మూవీ లవర్స్ మధ్య చర్చకు కారణమైంది. దీంతో ఇదెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూశారు. ఇప్పుడు స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈనెల 30 నుంచి జియో హాట్‌స్టార్‌లో మూవీ అందుబాటులోకి రానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీలోనూ స్ట్రీమింగ్ కానుంది.

'సర్వం మాయ' విషయానికొస్తే.. ఇదో అందమైన దెయ్యం కథ. ఇది మిమ్మల్ని భయపెట్టదు, నవ్విస్తుంది. చివరకు కంటతడి పెట్టిస్తుంది. ప్రభేందు (నివీన్ పౌలీ) ఓ గిటారిస్ట్. ఇతడి తండ్రి, అన్నయ్య పురోహితులు. కుటుంబం పౌరోహిత్యం చేస్తున్నప్పటికీ ప్రభేందుకి వీటిపై, దేవుడిపై పెద్దగా నమ్మకముండదు. అలాంటి ఇతడి జీవితంలోకి డెలులూ (రియా షిబు) అనే ఓ టీనేజ్ దెయ్యం వస్తుంది. ఈమె రాకతో ప్రభేందు జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి. గతం మర్చిపోయిన ఈ క్యూట్ దెయ్యం.. చివరకు ఎలా ముక్తి పొందింది అనేది స్టోరీ. ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం అస్సలు మిస్ కావొద్దు.

(ఇదీ చదవండి: మమ్ముట్టి 'పాదయాత్ర'.. అధికారిక ప్రకటన)

Videos

Dharmana : భూములు కొట్టేయడానికే చట్టమా? మీరే పెద్ద దొంగలు..

Perni Nani: జగన్ ట్రెండ్ సెట్టర్.. మీరు ఫాలోవర్స్..

GVMC ఉద్యోగి భౌతికకాయానికి YSRCP నేతల నివాళులు

ఉదయగిరిలో మగ పెద్ద పులి జాగ్రత్త..అటవీశాఖ హెచ్చరిక

ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డిని విచారించాలి

KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ

పట్టాలెక్కిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ జెండా ఊపిన ప్రధాని

RS Praveen : ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డిని విచారించాలి

Chandrasekhar : సచివాలయం ఉద్యోగులను చంపేస్తున్నారు.. ఇంకెంత మందిని బలి తీసుకుంటావ్

Kakinada : ఈ ప్రభుత్వానికి ఓటు వేసి నరకం చూస్తున్నాం..

Photos

+5

తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ బర్త్‌ డే పార్టీలో సెలబ్రిటీల సందడి (ఫోటోలు)

+5

Anchor Suma : అందం పెరుగుతోంది కానీ తగ్గట్లేదు (ఫోటోలు)

+5

లుక్‌ టెస్ట్‌ అంటూ ఫోటోలు వదిలిన శివాత్మిక రాజశేఖర్‌

+5

సుకుమార్ కుమార్తె బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

జిమ్‌లో కష్టపడుతున్న అనసూయ (ఫోటోలు)

+5

ఆర్సీబీ క్వీన్స్‌.. అదిరిపోయే లుక్స్‌.. స్మృతి స్పెషల్‌ (ఫొటోలు)

+5

కళ్లతో మాయ చేస్తూ.. అనుపమ గ్లామర్ షో (ఫొటోలు)

+5

మంచు ముద్దలలో మునిగిన లోయ (ఫొటోలు)

+5

ఇది అంతులేని కథలా.. సిట్‌ విచారణ వేళ కేటీఆర్‌ (చిత్రాలు)