Breaking News

ఓటీటీలోకి 'మ్యాడ్' హీరో కొత్త సినిమా

Published on Mon, 08/11/2025 - 14:13

మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో ఆకట్టుకున్న నటుడు సంగీత్ శోభన్. ఇతడు ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక నిర్మిస్తున్న ఓ మూవీలో హీరోగా లీడ్ రోల్ చేస్తున్నాడు. అయితే ఇతడు నటించిన ఓ చిత్రం ఇదే ఏడాది మరొకటి రిలీజైందని తెలుసా? అవునా ఏ సినిమా అది అని ఆశ్చర్యపోతున్నారా? అదే ఇప్పుడు దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో స్ట్రీమింగ్ కానుంది?

(ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వ వాహనంలో హీరోయిన్ నిధి అగర్వాల్ షికార్లు)

డైరెక్టర్ శోభన్‌కి ఇద్దరు కొడుకులు. పెద్దోడు సంతోష్ శోభన్ ఇదివరకే తెలుగులో ఆడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. చిన్నోడు సంగీత్ శోభన్ మాత్రం తొలుత ఓ వెబ్ సిరీస్ చేశాడు. తర్వాత 'మ్యాడ్' రెండు చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడు ప్రధాన పాత్రలో 'గ్యాంబ్లర్స్' అనే మూవీ చేశాడు. జూన్ 6న థియేటర్లలోకి కూడా వచ్చింది. కానీ కంటెంట్‌పైన నమ్మకం లేదో ఏమో గానీ ప్రమోషన్స్ చేయలేదు. దీంతో మూవీ అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది.

ఇప్పుడు ఈ చిత్రం సన్ నెక్స్ట్ ఓటీటీలో ఆగస్టు 14 అంటే ఈ గురువారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. 'గ్యాంబ్లర్స్' విషయానికొస్తే.. కార్డ్ క్యాజిల్ క్లబ్‌లో చాలామంది పేకాట ఆడుతుంటారు. ఆంటోని(మధుసూధనరావు) అలానే ఆడి తన వంశ గౌరవమైన లేడీ బర్డ్ అనే డైమండ్ కోల్పోతాడు. ఆ లేడీ బర్డ్ తర్వాత మిస్ అవుతుంది. దీంతో ఆంటోని కొడుకు ఏంజిల్ (సంగీత్ శోభన్)ని చిదంబరం (శ్రీకాంత్ అయ్యంగర్) తన చెప్పచేతుల్లో పెట్టుకుంటాడు. ఇంతకీ కార్డ్ క్యాజిల్ క్లబ్ సంగతేంటి? ఆ డైమండ్ కథేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ధనుష్‌తో డేటింగ్? ఎట్టకేలకు స్పందించిన మృణాల్)

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)