ఎప్పుడో హింట్ ఇచ్చిన సమంత.. ఇప్పుడు పెళ్లి జరిగేసరికి

Published on Tue, 12/02/2025 - 07:33

హీరోయిన్ సమంత మరో పెళ్లి చేసుకుంది. 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తీసిన దర్శకుల్లో ఒకరైన దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్‌లో ఈ శుభకార్యం జరిగింది. ఈ క్రమంలోనే నెటిజన్లు.. ఈ పెళ్లి గురించి తెగ డిస్కషన్ చేస్తున్నారు. ఇక్కడివరకు అందరికీ తెలుసు. అయితే సమంతకు చాన్నాళ్ల క్రితమే నిశ్చితార్థం జరిగిందా? ఆ మేరకు హింట్ కూడా ఇచ్చిందా? అనేది ఇప్పుడు వైరల్ అవుతోంది.

రాజ్‪‌తో సమంత స్నేహం ఇప్పటిది కాదు. 'ద ఫ్యామిలీ మ్యాన్' షూటింగ్ చేస్తున్న టైంలోనే అంటే 2020 నుంచే వీళ్లకు పరిచయముంది. కాకపోతే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత వీళ్ల మధ్య బాండింగ్ పెరిగినట్లుంది. మరి ఎప్పుడు ప్రేమలో పడ్డారో తెలియదు గానీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం సామ్-రాజ్ ఎప్పటికప్పుడు జంటగానే కనిపిస్తూ వచ్చారు. దీంతో వీళ్ల డేటింగ్ గురించి రూమర్స్ చాలానే వచ్చాయి. అయితే ఇలా సడన్‌గా పెళ్లి చేసుకుని షాక్ ఇస్తారని మాత్రం ఎవరూ అనుకోలేదు.

(ఇదీ చదవండి: రాజ్ ఎవరు? సమంతతో పరిచయం ఎలా? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)

పెళ్లి తర్వాత ఫొటోలని సమంత.. సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఒకదానిలో చేతికి డైమండ్ రింగ్ ఉంది. అయితే ఈ రింగ్ గతంలో సామ్ పోస్ట్ చేసిన ఓ ఫొటోలోనూ కనిపించింది. అది కూడా ఈ ఏడాది వాలంటైన్స్ డేకి ముందు రోజు. అంటే 10 నెలల క్రితమే సమంతకు నిశ్చితార్థం అయిపోయిందా? అనే సందేహం వస్తోంది. అప్పుడే చేతికి రింగ్‌తో హింట్ ఇచ్చింది కానీ అభిమానులు పసిగట్టలేకపోయారా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

సమంత.. గతంలో తెలుగు హీరో నాగచైతన్యని 2017లో పెళ్లి చేసుకుంది. కాకపోతే మనస్పర్థల కారణంగా 2021లో విడాకులు తీసుకున్నారు. మరోవైపు రాజ్ నిడిమోరు కూడా శ్యామోలి అనే మహిళని 2015లో పెళ్లి చేసుకున్నాడు. 2022లో వీళ్లు విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అలా సామ్, రాజ్.. ఇద్దరికీ ఇది రెండో పెళ్లినే కావడం విశేషం.

(ఇదీ చదవండి:'భూత శుద్ది వివాహం' చేసుకున్న సమంత.. అసలేంటిది?)

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)