Breaking News

వీళ్ల ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ ఇంత ఖరీదా..? డిజైనర్‌ ఎవరంటే.?

Published on Thu, 09/10/2026 - 18:30

సమంత కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్‌ ఇస్తూ.. తన ప్రగ్నెన్సీకి సంబంధించిన ప్రతీ అప్‌డేట్‌ అభిమానులతో పంచుకుంటూ ఏదో సందర్భంలో సోషల్‌ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది.  అయితే ఇటీవల ‘ది హాలీవుడ్‌ రిపోర్టర్‌ ఇండియా’తో మాట్లాడిన సమంత.. తన ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. దీంతో సమంత రూత్‌ ప్రభు, దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో వివాహం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో సమంత ధరించిన ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఎక్కువ మంది చదివింది: బిగ్‌బాస్‌ షాలిని జీవితంలో ఇంత విషాదమా?

‘ఈ రింగ్‌ ఎంపికలో నాకు ఎలాంటి సంబంధం లేదు. మొత్తం రాజ్‌ చూసుకున్నాడు. ఆయన్నే అడగాలి. రాజ్‌ ప్రపోజ్‌ చేసిన సమయంలోనే తొలిసారి ఆ రింగ్‌ను చూశాను’ అని చెప్పుకొచ్చింది. అయితే ఈ ఉంగరాన్ని గ్రీస్‌కు చెందిన ఓ జ్యువెలరీ డిజైనర్‌ రూపొందించారని మాత్రం నాకు తెలుసు. అని సమంత తెలిపింది. అయితే దీనిని ఏథెన్స్‌కు చెందిన థియోడోరోస్‌ సవోపౌలోస్‌ రూపొందించినట్లు తెలుస్తోంది. సమంత రింగ్‌ ధరించిన ఫొటోను ఆయన కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ వారి వైవాహిక జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు.
విలువ ఎంతంటే..
అయితే ఇప్పుడు ఆ రింగ్‌ ఖరీదు ఎంత ఉంటుందనే చర్చ. లొజెంజ్‌ కట్‌ డైమండ్‌తో రూపొందించిన ఈ రింగ్‌ విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందట. ఇందులో ఎనిమిది పోర్ట్రెయిట్‌ కట్‌ వజ్రాలు పూల రేకుల మాదిరిగా అమర్చినట్లు తెలుస్తోంది. అయితే పోర్ట్రెయిట్‌ కట్‌ వజ్రాలకు భారతీయ ఆభరణాల చరిత్రతోనూ  మంచి అనుబంధం ఉంది. మొఘల్‌ కాలంలో ఈ తరహా డిజైన్లు దొరికేవని చెబుతుంటారు. ప్రస్తుతం ఇలాంటి అరుదైన డిజైన్లను రూపొందించేవారి సంఖ్య కూడా తక్కువేనట. ​కాగా సమంత, రాజ్‌ నిడిమోరు 2025 డిసెంబర్‌ 1న అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. 
ఇదీ చదవండి: హీరోయిన్‌ ఆషిక మనసులో మాట.. తెలుగు వారికోసం ఇదే కోరిక

Videos

పోతిరెడ్డిపాడు వద్ద హైటెన్షన్ YSRCP నేతలను అడ్డుకున్న పోలీసులు

1500 మంది నకిలీ అభ్యర్థులు పూర్తి ఆధారాలతో జడ శ్రవణ్ సంచలన వీడియో

సూర్య సినిమాకు భారీ ఓపెనింగ్స్ పాన్ ఇండియా వసూళ్లే టార్గెట్!

దమ్ముంటే చర్చకు రా.. కూన రవికి చింతాడ రవికుమార్ సవాల్

VIdeo: ఇలా కూడా బ్యాంక్ దోచేస్తారా?

YSRCP నేతలతో గుడివాడ అమర్నాథ్ అత్యవసర మీటింగ్

దుమ్మురేపుతున్న సామ్సంగ్.. ఫోల్డబుల్ ఫోన్ లో ఏది బెస్ట్

ప్రభుత్వ స్కూల్ లో దారుణం 9వ తరగతి విద్యార్థినిపై టీచర్....

ప్రియాంక చనిపోక ముందు రోజు... డాక్టర్ ప్రియాంక తండ్రి ఎమోషనల్ వీడియో

స్టార్టింగ్ లోనే భారీ షాక్.! చరణ్ కాదు కృష్ణుడు అవుట్?

Photos

+5

హైదరాబాద్ లో ఆకట్టుకున్న వెరైటీ గణనాథులు (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి కృతి శెట్టి (ఫొటోలు)

+5

పుట్టినరోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియ శరణ్‌ (ఫొటోలు)

+5

కేరళ కుట్టీలా మారిపోయిన 'ధురంధర్' భామ.. (ఫొటోలు)

+5

చీరలో నాజూగ్గా నభా నటేశ్.. (ఫొటోలు)

+5

సౌండ్ బాక్స్‌తో గ్లామరస్ శ్రుతి హాసన్.. (ఫొటోలు)

+5

కామాఖ్య దేవాలయాన్ని దర్శించుకున్న ఉపాసన.. (ఫొటోలు)

+5

'ఖైదీ' పాప ఇప్పుడెలా ఉందో చూశారా? ఏడేళ్ల తర్వాత మళ్లీ కలిశారు (ఫొటోలు)

+5

ఆదిలాబాద్ జిల్లాలో పోలాల అమావాస్య వేడుకలు...(ఫొటోలు)