సమంత రెండో పెళ్లి.. నాగచైతన్య పాత వీడియో వైరల్‌

Published on Tue, 12/02/2025 - 12:52

డేటింగ్‌ వార్తలకు తెరదించుతూ సమంత- రాజ్‌ నిడిమోరు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 1న కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో ఉన్న లింగభైరవి దేవి సన్నిధిలో యోగ సంప్రదాయం ప్రకారం ‘భూత శుద్ధి వివాహం’ ద్వారా సామ్‌-రాజ్‌ ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. 

అటు సామ్‌(Samantha)కి, ఇటు రాజ్‌కి ఇది రెండో పెళ్లి. 2017లో సమంత.. నాగ చైతన్య(Naga Chaitanya)ను ప్రేమ వివాహం చేసుకుంది. నాలుగేళ్లు కలిసి కాపురం చేసిన తర్వాత 2021లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకున్నప్పటికీ.. సామ్‌ మాత్రం ఒంటరిగా ఉంది. రాజ్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చినా.. ఆమె స్పందించలేదు. ఇప్పుడు సడెన్‌గా పెళ్లి చేసుకొని అందరికి షాకిచ్చింది. 

(చదవండి:  సమంత రెండో పెళ్లి.. అలా చేసుకున్న స్టార్ హీరోయిన్స్‌ వీళ్లే..!)

ఇదిలా ఉంటే.. సామ్‌ పెళ్లి చేసుకున్న ఫోటోలు బయటకు రాగానే.. సోషల్‌ మీడియా నాగచైతన్యకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అయింది. గతంలో ఓ పాడ్‌ కాస్ట్‌ ఇంటర్వ్యూలో చైతన్య విడాకుల విషయంపై ఎమోషనల్‌గా మాట్లాడారు.

‘నా జీవితంలో ఏదైనా జరిగింది(విడాకులు).. అలా చాలా మంది జీవితాల్లో కూడా జరిగింది. కానీ నన్ను ఒక్కడినే క్రిమినల్‌గా ఎందుకు చూస్తున్నారో అర్థం కాలేదు. మేమిద్దరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం.ఈ విడాకుల బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుండే బ్రోకెన్ ఫ్యామిలీ నుండి వచ్చాను. అందుకే ఒక బంధాన్ని బ్రేక్ చేసుకునే సమయంలో ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించాను. 

వెయ్యి సార్లు ఆలోచించాకే ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయాం. ఆ సమయంలో మాకు ప్రైవసీ ఇవ్వాలి అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు అది హెడ్ లైన్‌గా అయిపోయి.. గాసిప్‌లా మార్చేసి.. చివరకు ఆ టాపిక్‌ని ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌లా మార్చేశారు.     నేను చాలా సార్లు ఆలోచించాను. బయటకు వచ్చి దాని గురించి మాట్లాడితే.. దాని మీద కూడా ఇంకొన్ని ఆర్టికల్స్‌ పుడతాయి. అందుకే మాట్లాడలేదు. రాసేవాళ్లే దీనికి ఫుల్‌స్టాఫ్‌ పెట్టాలి’ అని చైతూ చెప్పుకొచ్చాడు. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)