Breaking News

మరో పెళ్లి చేసుకున్న సమంత

Published on Mon, 12/01/2025 - 12:40

హీరోయిన్ సమంత మళ్లీ పెళ్లి చేసుకుంది. గత కొన్నాళ్ల నుంచి ఈమె.. దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తుందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్లే చాలాసార్లు వీళ్లు జంటగా కనిపించారు. ఇప్పుడు ఆ వార్తలని నిజం చేస్తూ సింపుల్‌గా వివాహం చేసుకున్నారు.

పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచారు. ఈరోజు (డిసెంబరు 01) ఉదయం కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో కేవలం 20 మంది అతిథుల సమక్షంలోనే సామ్-రాజ్ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ మేరకు మొదట వార్తలు బయటకొచ్చాయి. కాసేపటికే సమంత.. తన సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్)

'ఏ మాయ చేశావె' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. తర్వాత ఎన్టీఆర్, మహేశ్ బాబు తదితర స్టార్ హీరోలతో పనిచేసింది. నాగచైతన్యతోనూ పలు చిత్రాల్లో కలిసి పనిచేసింది. అలా చేస్తున్న టైంలోనే సామ్-చైతూ ప్రేమలో పడ్డారు. పెద్దల్ని ఒప్పించి 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు.

విడాకుల తర్వాత హీరోయిన్ శోభితతో నాగచైతన్య ప్రేమలో పడ్డారు. గతేడాది వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే 'ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ చేస్తున్న టైంలో సమంత-రాజ్ మధ్య పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. తర్వాత వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇప్పుడు  వివాహంతో ఒక్కటయ్యారు. 

👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

(ఇదీ చదవండి: భరణి ఉగ్రరూపం.. నామినేషన్స్‌లో ఆరుగురు)

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)