Breaking News

టాయిలెట్స్ శుభ్రం చేసేవాడిని.. సల్మాన్ కామెంట్స్ వైరల్!

Published on Tue, 08/15/2023 - 12:23

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బిగ్ బాస్-2 ఓటీటీ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. దాదాపు నెల రోజులకు పైగా సాగిన రియాలిటీ షో సోమవారం  ముగిసింది. ఈ సీజన్‌లో ఎల్విశ్ యాదవ్‌ విన్నర్‌గా నిలిచాడు. ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వచ్చిన ఎల్విశ్ యాదవ్‌ విన్నర్‌గా నిలవడం విశేషం. అయితే బిగ్ బాస్ ఓటీటీ సీజన్‌-2 గ్రాండ్ ఫినాలే సందర్భంగా సల్మాన్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మనం చేసే ఏ పని అయినా సరే అవమానంగా, చిన్నదిగా భావించకూడదని అన్నారు.

(ఇది చదవండి: నా గురించి రాత్రింబవళ్లు ఆలోచించి డబ్బు వృథా చేసుకోకండి: కంగనా)

'బిగ్ బాస్ ఓటీటీ సీజన్- 2'లో కంటెస్టెంట్స్‌లో ఒకరైన పూజా భట్ గ్రాండ్ ఫినాలే సమయంలో ఎలిమినేట్ అయిన మొదటి వ్యక్తి. ఈ సందర్భంగా సల్మాన్ ఆమెను ప్రశంసించారు. హౌస్‌లో ఆమె ఉన్నప్పుడు టాయిలెట్‌లు, వాష్‌రూమ్‌లను శుభ్రంగా ఉంచడం పట్ల పూజాను కొనియాడారు.  ప్రపంచంలోని ఏ పనిని చిన్నదిగా భావించకూడదని హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులకు సలహా ఇచ్చారు. అంతేకాకుండా తాను జైలు, పాఠశాలలో టాయిలెట్స్ శుభ్రం చేశానని గుర్తు చేసుకున్నారు. 

'బిగ్ బాస్' గత సీజన్లలోని కంటెస్టెంట్లకు గుణపాఠం చెప్పేందుకు తానే స్వయంగా హోస్‌లోకి ప్రవేశించి టాయిలెట్లను శుభ్రం చేయాల్సి వచ్చిందని సల్మాన్ గుర్తు చేసుకున్నాడు. 'బిగ్ బాస్' హౌస్‌లోని వాష్‌రూమ్స్ సీజన్‌లో పూజ  శుభ్రం చేసినట్లు తానెప్పుడూ చూడలేదన్నారు. కాగా.. కృష్ణజింకలను వేటాడిన కేసుతో పాటు హిట్ అండ్ రన్ కేసులో నిర్దోషిగా బయటపడే వరకు సల్మాన్ చాలా రోజులు జైలులో ఉన్న సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి: కుల విభేదాలకు కారణం రాజకీయ నాయకులే : నటుడు శరత్‌ కుమార్‌)

బిగ్ బాస్ OTT 2 గ్రాండ్ ఫినాలే 

'బిగ్ బాస్ ఓటీటీ సీజన్- 2' గ్రాండ్ ఫినాలే ట్రోఫీ కోసం  అభిషేక్ మల్హాన్, ఎల్విష్ యాదవ్ పోటీలో నిలవగా చివరికి ఎల్విష్ యాదవ్‌ను విన్నర్‌గా ప్రకటించారు. ఈ రియాలిటీ షో చరిత్రలో ట్రోఫీని గెలుచుకున్న మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అతను నిలిచాడు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)