ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్
Breaking News
సుమ తనయుడి కొత్త సినిమా.. క్రేజీ సాంగ్ వచ్చేసింది
Published on Fri, 10/24/2025 - 16:32
యాంకర్ సుమ తనయుడు రోషన్ (Roshan Kanakala) హీరోగా వస్తోన్న తాజా చిత్రం 'మోగ్లీ' (Mowgli). ఇప్పటికే ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. బబుల్గమ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రోషన్.. ప్రస్తుతం సందీప్ రాజ్‌తో జతకట్టారు. ఈ చిత్రంలో రోషన్ సరసన సాక్షి మడోల్కర్ హీరోయిన్గా కనిపించనుంది.
తాజాగా ఈ మూవీ నుంచి లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సయ్యారే అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. కాల భైరవ, ఐశ్వర్య దరూరి ఆలపించారు. ఈ సినిమాకు కాల భైరవ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫారెస్ట్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు కీలక పాత్రలు పోషించారు. కాగా.. మోగ్లీ డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది.
Tags : 1