Breaking News

చెంపదెబ్బ వల్ల చాలా గట్టిగా ఏడ్చేశాను: హీరోయిన్ రష్మిక

Published on Fri, 01/19/2024 - 15:47

పాన్ ఇండియా రష్మిక కన్నీళ్లు పెట్టుకుంది. అవును మీరు సరిగానే విన్నారు. ఓ చెంపదెబ్బ వల్లే ఇదంతా జరిగింది. అప్పుడేం జరిగిందనే విషయాన్ని స్వయంగా ఈ బ్యూటీనే బయటపెట్టింది. ఈ సంఘటన జరిగిన సమయంలో తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయానని.. ఏడుస్తూ అరిచేశానని చెప్పుకొచ్చింది. ఇంతకీ అసలేం జరిగింది? 

కన్నడ బ్యూటీ రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. కొన్నాళ్ల క్రితం 'యానిమల్' మూవీలో నటించిన రష్మిక.. అద్భుతమైన సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది. అలానే ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర సంగతుల్ని బయటపెట్టింది.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన 21 సినిమాలు)

యానిమల్ సినిమాలో గీతాంజలి పాత్రలో రష్మిక, రణ్ విజయ్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటించారు. జోయా పాత్రలో తృప్తి దిమ్రి యాక్ట్ చేసింది. ఓ సీన్‌లో భాగంగా జోయాతో శృంగారంలో పాల్గొన్నానని రణ్ విజయ్ వచ్చి తన భార్య గీతాంజలితో చెబుతాడు. దీంతో ఈమెకు కోపమొచ్చి భర్త చెంపపై గట్టిగా లాగి పెట్టి కొడుతుంది. అయితే ఈ సీన్ పూర్తయిన తర్వాత తను ఏడవడంతో పాటు గట్టిగట్టిగా అరిచానని రష్మిక చెప్పింది.

'ఆ సీక్వెన్స్ మొత్తం ఒకే టేక్‌లో కంప్లీట్ చేశాం. అయితే ఈ సీన్‌లో యాక్ట్ చేస్తున్నప్పుడు నేనేం చేస్తున్నాననేది కూడా నాకు గుర్తులేదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఓ భార్య ఎలా ఫీల్ అవుతుందో అలానే రియాక్ట్ అవ్వాలని సందీప్ నాకు చెప్పాడు. నాకు అది మాత్రమే గుర్తుంది. యాక్షన్-కట్ తప్పితే మధ్యలో ఏం జరిగిందో గుర్తులేదు. అయితే సీన్‌లో రణ్‌బీర్‌ చెంపపై కొట్టిన తర్వాత గట్టిగా ఏడవడంతో పాటు అరిచేశాను. ఆ తర్వాత రణ్‌బీర్ దగ్గరకు వెళ్లి అంతా ఓకేనా అని అడిగాను. అయితే ఈ సినిమా, ఈ సీన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. చెప్పాలంటే నాకే ఆశ్చర్యంగా అనిపించింది' అని రష్మిక చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: హనుమాన్ సినిమాపై హీరోయిన్ సమంత రివ్యూ)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)