Breaking News

రిలీజ్‌కు ముందే రికార్డులు.. దురంధర్‌-2 ప్రభంజనం..!

Published on Mon, 03/09/2026 - 11:50

రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా వచ్చిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ దురంధర్. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. అయితే కొన్ని నెలల వ్యవధిలోనే ఈ మూవీకి సీక్వెల్‌గా దురంధర్‌ ది రివెంజ్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 

ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. అంచనాలు మరింత పెంచేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. కేవలం రెండు రోజుల్లో రెండు లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడు కావడం చూస్తుంటే ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో అర్థమవుతోంది. అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే రూ. 18.11 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వెబ్‌సైట్ సాక్నిల్క్ తెలిపింది.

ఈనెల 19న దురంధర్‌ ది రివెంజ్ థియేటర్లలోనే సందడి చేయనుంది. అంతకుముందు రోజే ఈ సినిమా ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నారు. ఈ షోల కోసం మేకర్స్ ముందుగానే బుకింగ్‌లు ప్రారంభించడంతో చాలా థియేటర్లలో టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. హిందీలో మొదటి రోజే టికెట్ ధర ప్రస్తుతం రూ. 450-500 మధ్య ఉంది. ఈ మూవీ రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)