థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు
Breaking News
15 రోజుల్లో దురంధర్-2 కలెక్షన్స్.. అఫీషియల్ ప్రకటన
Published on Fri, 04/03/2026 - 12:06
రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్-2. గతేడాది రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన దురంధర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మార్చి 19న విడుదలైదన ఈ మూవీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ మరో మైలురాయిని చేరుకుంది. రిలీజైన 15 రోజుల్లోనే రూ.1501 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.
తొలివారంలో వెయ్యి కోట్లు దాటిన దురంధర్ ది రివెంజ్.. రెండోవారంలో కాస్తా జోరు తగ్గింది. ఈ వసూళ్లతో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సినిమా కంటే ముందు దంగల్, బాహుబలి-2, పుష్ప-2 తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు భారతదేశంలో రూ. 937.32 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది.
ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో ఈ మూవీని తెరకెక్కించారు. పాకిస్తాన్‌కు వెళ్లిన ఇండియన్ స్పై జీవితం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ భారతీయ గూఢచారి హంజా అలీ మజారి పాత్రలో నటించారు. ఇందులో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి, డానిష్ పాండోర్, సారా అర్జున్ కీలక పాత్రలు పోషించారు.
Duniya bhar mein goonj rahi hai naye Hindustan ki dahaad. 🔥
Day-wise break-up | India
Week 1: ₹690 Cr*
DAY 9: ₹42 Cr*
DAY 10: ₹64 Cr*
DAY 11: ₹71 Cr*
DAY 12: ₹26 Cr*
DAY 13: ₹28 Cr*
DAY 14: ₹21 Cr*
Day 15: ₹19 Cr*
India: ₹961 Cr*
Worldwide GBOC (2 weeks)
India:… pic.twitter.com/jF0uS998P1— Jio Studios (@jiostudios) April 3, 2026
Tags : 1