సమంతకి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన రాజ్?

Published on Wed, 12/03/2025 - 16:31

హీరోయిన్ సమంత రీసెంట్‌గానే మరో పెళ్లి చేసుకుంది. 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్‌లో లింగభైరవి సన్నిధిలో చాలా సింపుల్‌గా ఈ వివాహ వేడుక జరిగింది. అయితే పెళ్లికి ముందే సమంతకు రాజ్ ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడని అంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?

దర్శకుడు రాజ్‌తో సమంతకు గత నాలుగైదేళ్లుగా పరిచయం. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ రెండో సీజన్ చేసే టైంలో ఏర్పడిన పరిచయం కాస్త తర్వాత ప్రేమగా మారింది. ఇన్నాళ్లకు పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే ఇద్దరికీ ఇది రెండో పెళ్లినే. నాగచైతన్యకు సమంత విడాకులు ఇవ్వగా.. రాజ్ కూడా తన తొలి భార్య శ్యామోలికి 2022లో విడాకులు ఇచ్చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి పోలీస్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్) 

ప్రస్తుతం రాజ్.. దర్శకుడు, నిర్మాతగా ఉన్నారు. సమంత కూడా ప్రస్తుతం తన నిర్మాణ సంస్థలోనే 'మా ఇంటి బంగారం' అనే మూవీ చేస్తోంది. ఈ సంస్థలోనే సమంతతో పాటు రాజ్ కూడా భాగస్వామిగా ఉన్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. అయితే అక్టోబరులో సమంత.. కొన్ని ఫొటోలని పోస్ట్ చేసింది. వాటిలో కొత్త ఇంటికి సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ లగ్జరీ హౌస్‌ని రాజ్.. సమంతకు పెళ్లి గిఫ్ట్‌గా ముందే ఇచ్చాడని అంటున్నారు. పెళ్లిరోజు సామ్ వేలికి ఉన్న రింగ్ కూడా రాజ్ బహుమతిగా ఇచ్చాడని అంటున్నారు. దీని విలువ కూడా లక్షల్లోనే ఉంటుందట.

ప్రస్తుతం సమంత-రాజ్.. గోవాకు హనీమూన్‌కి వెళ్లారని, తిరిగి వచ్చిన తర్వాత ఎవరి ప్రాజెక్ట్‌లతో వారు బిజీ కానున్నారని తెలుస్తోంది. రాజ్ కూడా 'ద ఫ్యామిలీ మ్యాన్' నాలుగో సీజన్ తీయాల్సి ఉంది.

(ఇదీ చదవండి: రోజుకు 500 కాల్స్‌.. తలనొప్పిపడలేక వీడియో చేశా: హేమ)

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)