Breaking News

'ఓజీ' హీరోయిన్ కొరియన్ కాన్సెప్ట్ మూవీ.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్

Published on Tue, 02/24/2026 - 14:46

ఓటీటీ కల్చర్ పెరిగిన తర్వాత కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసేవాళ్లు, ఇష్టపడే వాళ్ల సంఖ్య బాగానే ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా చాలామంది అమ్మాయిలు.. వీటిపట్ల బాగా ఆకర్షితులవుతున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఓ కొరియన్ కాన్సెప్ట్ మూవీలో 'ఓజీ' ఫేమ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ లీడ్ రోల్ చేసింది. ఇప్పుడీ చిత్ర స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో తీసిన తమిళ సినిమా 'మేడిన్ కొరియా'. దీన్ని ఓటీటీ కోసమే రూపొందించారు. ఆర్ఏ కార్తీక్ దర్శకత్వం వహించాడు. గత నెలలో ఈ చిత్ర గురించి ప్రకటన రాగా ఇప్పుడు స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు. వచ్చే నెల 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

చిన్నప్పటి నుంచి కొరియా అంటే ఇష్టం పెంచుకున్న ఓ అమ్మాయి.. పెరిగి పెద్దయిన తర్వాత అనుకున్నట్లే కొరియా వెళ్తుంది. ఆ దేశంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది? చివరకు ఏం తెలుసుకుంది అనేదే స్టోరీలా అనిపిస్తుంది. గత నెలలో టీజర్ రిలీజ్ చేశారు. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేస్తే కాన్సెప్ట్‌పై ఇంకాస్త క్లారిటీ రావొచ్చు.

ఇకపోతే ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు రానున్నాయి. వాటిలో నవీన్ చంద్ర 'హనీ', అక్యూజ్డ్ అనే డబ్బింగ్ చిత్రాలు రాబోతున్నాయి. అలానే డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు కనబడుటలేదు, రోస్లిన్ అనే వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇవి కాకుండా మరేవైనా సర్‌ప్రైజ్ చిత్రాలు కూడా అందుబాటులోకి రావొచ్చేమో చూడాలి?

(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ బోల్డ్ సినిమా.. 'హాట్‌స్పాట్ 2 మచ్' తెలుగు రివ్యూ)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)