Breaking News

‘మంచు’ బ్రదర్స్‌కి అండగా ప్రభాస్‌.. మనోజ్‌ ఎమోషనల్‌!

Published on Sat, 09/13/2025 - 17:21

ప్రభాస్‌ మంచితనం గురించి అందరికి తెలిసిందే. సాయం కోరి వస్తే.. తనకు సాధ్యమైనంతవరకు చేస్తాడని ఆయనను దగ్గర నుంచి చూసిన వాళ్లు చెబుతుంటారు. తన వల్ల ఒక సినిమాకు హెల్ప్‌ అవుతుందని చెబితే.. ‘స్టార్‌’ హోదాని సైతం పక్కకు పెట్టి వస్తాడని ‘కన్నప్ప’తో నిరూపించాడు.

(చదవండి: నా కుటుంబాన్ని నిలబెట్టారు, నాలో భయాన్ని చంపేశారు: మనోజ్‌ భావోద్వేగం)

ప్రభాస్‌కి ఉన్న క్రేజ్‌కి ‘కన్నప్ప’లోని రుద్ర పాత్ర చాలా చిన్నదనే చెప్పాలి. కానీ మోహన్‌ బాబు, మంచు విష్ణుల కోసం ప్రభాస్‌ ఆ పాత్ర ఒప్పుకున్నాడు. ప్రభాస్‌ కనిపించినంత సేపు థియేటర్స్‌ ఊగిపోయాయి. ఆయన ఉండడం వల్లే కన్నప్ప తొలి రోజు భారీ కలెక్షన్స్‌ రాబట్టగలిగింది. అయితే ఈ చిత్రానికి ప్రభాస్‌ కూడా ఒక్క రూపాయి పారితోషికంగా తీసుకోకపోవడం గమనార్హం. ప్రభాస్‌ స్థానంలో మరో ఏ హీరో ఉన్నా.. ఇలా ఒప్పుకునేవారు కాదేమో. ఈ విషయాన్ని మంచు విష్ణు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు

(చదవండి: రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన మిరాయ్‌.. తేజ కెరీర్‌లోనే అత్యధికం..)

అలా కన్నప్పతో మంచు విష్ణుకి తోడుగా నిలిచిన ప్రభాస్‌.. ఇప్పుడు ‘మిరాయ్‌’తో తమ్ముడు మనోజ్‌కి అండగా నిలిచాడు.  తేజ సజ్జ, మనోజ్‌ నటించిన ఈ చిత్రానికి ప్రభాస్‌ గాత్రదానం చేశాడు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన చిత్ర యూనిట్‌..రిలీజ్‌కి కొన్ని గంటల ముందు అఫిషియల్‌గా ప్రకటించింది. ప్రభాస్‌ వాయిస్‌ ఓవర్‌కి థియేటర్స్‌ దద్దరిల్లిపోతుండగా, సోషల్‌ మీడియా  ఊగిపోతుంది. 

ఇలా అటు కన్నప్ప, ఇటు మిరాయ్‌ చిత్రాలకు తనవంతు సాయం అందించి, మంచు బ్రదర్స్‌కి రెబల్‌ స్టార్‌ అండగా నిలిచాడు. ఇదే విషయాన్ని  మిరాయ్‌ సక్సెస్‌ మీట్‌లో మంచు మనోజ్‌ గుర్తు చేస్తూ కాస్త ఎమోషనల్‌ అయ్యాడు. ‘మా అన్నదమ్ములకు సపోర్ట్‌గా నిలబడినందుకు థ్యాంక్యూ సో మచ్‌ డార్లింగ్‌’ అంటూ ప్రభాస్‌కి కృతజ్ఞతలు తెలిపాడు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)