Breaking News

ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా.. మూడేళ్ల తర్వాత

Published on Sat, 09/13/2025 - 16:41

ఈ వారం థియేటర్లలోకి వచ్చిన 'మిరాయ్', 'కిష్కింధపురి' చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. అందుకు తగ్గట్లే ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది. మరోవైపు ఓటీటీల్లోనూ కూలీ, సయారా, సు ఫ్రమ్ సో, పరదా లాంటి హిట్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇలా వీకెండ్‌ని ఆడియెన్స్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మరో తెలుగు మూవీ కూడా డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చింది. దాదాపు మూడేళ్ల తర్వాత స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.

(ఇదీ చదవండి: 'కూలీ'లో నటించి తప్పు చేశా.. ఆమిర్ అంత మాటన్నాడా?)

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి.. గతంలో ఓ సినిమాలో ప్రతినాయకుడిగా చేశారు. అదే 'పగ పగ పగ'. 2022 సెప్టెంబరు 22న ఇది థియేటర్లలో రిలీజైంది. స్టార్స్ ఎవరూ లేకపోవడం, కథాకథనాలు ఓ మాదిరిగా ఉండేసరికి ఈ చిత్రంపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. తర్వాత ఇన్నాళ్లకు ఆహా ఓటీటీ దీన్ని కొనుగోలు చేసింది. ఇప్పుడు అంటే దాదాపు మూడేళ్ల తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

'పగ పగ పగ' విషయానికొస్తే.. జగదీశ్ (కోటి), కృష్ణ (బెనర్జీ) రౌడీలు. జగదీశ్ చెప్పడంతో కృష్ణ, ఓ కుర్రాడిని హత్య చేస్తాడు. జైలుకెళ్లిన కృష్ణకి జగదీశ్ ధైర్యం చెబుతాడు. కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇస్తాడు. కానీ కృష్ణ కుటుంబాన్ని జగదీశ్ గాలికొదిలేస్తాడు. మరోవైపు కృష్ణ కొడుకు అభి కాలేజీలో చదువుతుంటాడు. జగదీశ్ కూతురు సిరితో ప్రేమిస్తుంటాడు. కూతురి ప్రేమ విషయం జగదీశ్‌కి తెలుస్తుంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగదని కూతురితో చెబుతాడు. దాంతో లేచిపోయి వెళ్లిపోయిన సిరి, అభిని పెళ్లి చేసుకుంటుంది. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: 'మిరాయ్'తో పోటీ.. 'కిష్కింధపురి' తొలిరోజు కలెక్షన్ ఎంత?)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)