Breaking News

డాకు మహారాజ్‌కు హిట్ టాక్‌. తొలిరోజే ఓవర్‌సీస్‌లో క్రేజీ రికార్డ్‌

Published on Mon, 01/13/2025 - 09:33

నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'డాకు మహారాజ్'(Daaku Maharaaj Movie). బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. జనవరి 12న బాక్సాఫీస్ బరిలో దిగిన డాకు మహారాజ్‌ తొలిరోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. బాలయ్య మూవీకి సూపర్ హిట్ టాక్ రావడంతో ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేశారు.

తాజాగా ఈ మూవీ అరుదైన ఘనత సాధించింది. తొలిరోజే యూఎస్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.  మొదటి రోజే అమెరికాలో 10 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా డాకు మహారాజ్ మూవీ పోస్టర్‌ను షేర్ చేసింది.

డాకు మహారాజ్‌ ట్రైలర్‌ రిలీజైనప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. బాలయ్య పవర్‌ఫుల్ డైలాగ్స్ ఆడియన్స్‌కు ఆకట్టుకున్నాయి. 'రాయలసీమ మాలుమ్ తేరేకు.. వో మై అడ్డా' అనే డైలాగ్ ముఖ్యంగా మాస్‌‌ ఫ్యాన్స్‌ను కట్టిపడేసింది.

కాగా.. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్స్‌గా కనిపించారు. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్‌, చాందిని చౌదరి కీలక పాత్రల్లో నటించారు.

(ఇది చదవండి: Daaku Maharaaj Review: ‘డాకు మహారాజ్‌’ మూవీ రివ్యూ)

తమన్ బీజీఎంపై ప్రశంసలు..

తొలిరోజు డాకు మహారాజ్‌ వీక్షించిన ప్రేక్షకులు మూవీపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా తమన్ బీజీఎం అదిరిపోయిందని కామెంట్స్ చేశారు. మరోసారి తమన్ వేరే లెవెల్‌కు తీసుకెళ్లారని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. బాలయ్య ఖాతాలో మరో సూపర్ హిట్ పడిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ మూవీ తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే యూఎస్‌లో 10 లక్ష డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

అమెరికాలో రికార్డ్ ప్రీ సేల్స్..

ఈ సారి డాకు మహారాజ్‌  సినిమాకు  అమెరికాలో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అమెరికాలో ఇప్పటికే టికెట్స్‌ ప్రీ సేల్స్‌లో రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటి వరకు రికార్డ్‌ స్థాయిలో 10 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. అమెరికాలోని దాదాపు 125 లోకేషన్స్‌లలో 350 షోలు ఫస్ట్‌ రోజే ప్రదర్శించారు. 

అనంతపురంలో సక్సెస్ మీట్

డాకు మహారాజ్‌ (Daaku Maharaaj) సక్సెస్‌ మీట్‌ను అనంతపురంలో నిర్వహిస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi) ప్రకటించారు. ప్రెస్‌ మీట్‌లో మాట్లాడిన ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ రద్దు కావడం వల్ల సక్సెస్ మీట్‌ అక్కడే నిర్వహించనున్న‍ట్లు నాగవంశీ వెల్లడించారు. 

 టికెట్‌ ధరల పెంపునకు అనుమతి..

డాకు మహారాజ్ మూవీకి  బెనిఫిట్‌ షోలతో పాటు టికెట్‌ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది.  12వ తేదీ ఉదయం 4 గంటల ప్రత్యేక షో  కోసం అనుమతితో పాటు ఒక్కో టికెట్‌ రూ.500 కు విక్రయించేందుకు అనుమతిచ్చింది. రోజుకు ఐదు షోలతో పాటు  ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరలపై అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.135, సింగిల్‌ థియేటర్స్‌లలో రూ.110 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. జనవరి 26 వరకు ఈ ధరలు ఉంటాయి.

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)