Breaking News

పులిలా నడవమని లోకేశ్ చెప్పేవాడు.. కమ్ముల మాత్రం: నాగార్జున

Published on Fri, 06/13/2025 - 12:43

నాగార్జున హీరోగా కొత్త సినిమాలు చేయక చాన్నాళ్లయింది. అలా అని ఖాళీగా ఏం లేడు. కూలీ, కుబేర చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తున్నాడు. ఇదివరకే వీటికి సంబంధించిన లుక్స్, గ్లింప్స్ వీడియోలు రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు మూవీస్‍‌తో నాగ్ సరికొత్తగా కనిపించబోతున్నాడనే హింట్ అయితే వచ్చేసింది. త్వరలో ఈ రెండు మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ క్రమంలోనే నాగ్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు. ఓ ఇంటర్వ్యూల మాట్లాడుతూ ఈ రెండు చిత్రాలు, దర్శకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'కూలీ' సినిమాలో రజినీకాంత్ హీరో. లోకేశ్ కనగరాజ్ దర్శకుడు. కొన్నిరోజుల క్రితం చిన్న వీడియో లాంటిది రిలీజ్ చేశాడు. ఇందులో నాగార్జునని వెనక వైపు నుంచి చూపించారు. అలా కొన్ని సెకన్లపాటు కనిపించిన ఈ వీడియో స్టైలిష్‌గా ఉండేసరికి మంచి క్రేజ్ వచ్చింది. ఈ మూవీలో నాగ్.. సైమన్ అనే ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించిన నాగ్.. 'లోకేశ్ ఎప్పుడు పులిలా నడవమని అనేవాడు. మిమ్మల్ని చూస్తే ప్రేక్షకులు భయపడాలి సర్ అనేవాడు' అని చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్ సినిమా)

అదే టైంలో 'కుబేర' తీసిన దర్శకుడు శేఖర్ కమ్ముల మాత్రం 'మీరు హీరోలా నడుస్తున్నారు. కొంచెం తగ్గించండి' అని చెప్పేవాడు. వీళ్లిద్దరికీ అదే తేడా. కూలీ విషయానికొస్తే.. 'లోకేశ్ నన్ను చాలా అద్భుతంగా చూపించాడు. నన్ను నేను అలానే చూడాలనుకున్నాను. సినిమా చూస్తున్నంతసేపు విజిల్స్ వేస్తూనే ఉంటారు. గడిచిన నాలుగు దశాబ్దాలుగా ఎన్నో సక్సెస్‌లు చూశాను. మూవీ కలెక్షన్స్ నాకు ముఖ్యం కాదు' అని నాగార్జున చెప్పుకొచ్చాడు.

రజినీకాంత్-లోకేశ్ కనగరాజ్ 'కూలీ' మూవీ.. ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. తెలుగులోనూ ఈ చిత్రానికి భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు శేఖర్ కమ్ముల తీసిన 'కుబేర' సినిమా.. ఈనెల 20న అంటే వచ్చే శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఇందులో ధనుష్, రష్మిక హీరోహీరోయిన్లు కాగా.. నాగ్ కీలక పాత్ర పోషించాడు. ఈ రెండు మూవీస్ హిట్ అయితే గనక నాగార్జునని ఇలా మరిన్ని సినిమాల్లో డిఫరెంట్ రోల్స్‌లో చూడొచ్చేమో?

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)