తిరుపతిలో అయ్యప్ప భక్తులకు అవమానం
Breaking News
ట్రెండింగ్ బ్యూటీ.. ఇంతకీ ఎవరీమె? డీటైల్స్ ఏంటి?
Published on Tue, 11/11/2025 - 11:58
గత మూడు నాలుగు రోజుల నుంచి ఓ నటి ఫొటో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దానికి కారణం ఓ ఇంటర్వ్యూ. అలా అని ఆమె గ్లామరస్ హీరోయిన్ కాదు, ఇంటర్వ్యూలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఏం చేయలేదు. అయినా సరే ఈమె గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఈమె ఎవరా అని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే నటి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఎందుకు వైరల్ అవుతుందనేది చూద్దాం.
సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎందుకు వైరల్ అవుతారనేది చెప్పలేదు. తాజాగా ఓ హిందీ ఇంటర్వ్యూలో మరాఠీ నటి గిరిజా ఓకే పాల్గొంది. తన గురించి పలు విషయాలు చెప్పింది. 'కాంతార 1' ఫేమ్ గుల్షన్ దేవయ్య.. తనతో ఓ రొమాంటిక్ సీన్ చేస్తున్నప్పుడు నువ్వు ఓకేనా అని 17 సార్లు తనని అడిగాడని, అలాంటి యాక్టర్స్‌తో కలిసి పనిచేస్తున్నప్పుడు చాలా సౌకర్యంగా ఉంటుందని గిరిజా చెప్పుకొచ్చింది. ఈ బిట్‌తో పాటు ఇంటర్వ్యూకి సంబంధించిన పలు వీడియో క్లిప్స్ ట్విటర్‌లో తెగ కనిపిస్తున్నాయి.
(ఇదీ చదవండి: నాన్న చనిపోలేదు.. ధర్మేంద్ర కూతురి షాకింగ్ పోస్ట్)
స్లీవ్ లెస్ బ్లౌజ్, స్కై బ్లూ చీరలో గిరిజా ఓకే చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ.. నెటిజన్లు ఎందుకో ఈమెని చూసి ఫిదా అయిపోయినట్లు ఉన్నారు. అందుకే ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యేసరికి ఈమె ఎవరా అని తెగ కామెంట్స్ పెడుతున్నారు. అలా అని ఈమేం కొత్తగా ఇప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన నటి కాదు. 2004 నుంచి సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్‌లు చేస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకుంది.
స్వతహాగా మరాఠీ నటి అయిన గిరిజా ఓక్.. హిందీలోనూ పలు మూవీస్ చేసింది. బాలీవుడ్‌లో 'తారే జమీన్ పర్' ఈమె మొదటి చిత్రం. ఇందులో చిన్న రోల్ చేసినప్పటికీ ఫేమ్ సంపాదించింది. తర్వాత సొంత భాష మరాఠీతో పాటు హిందీలోనూ షోర్ ఇన్ ద సిటీ(2010), కాలా, జవాన్ (2023) చిత్రాలు చేసింది. రీసెంట్‌గా ఓటీటీలో రిలీజైన ఇన్‌స్పెక్టర్ జెండే మూవీలోనూ కనిపించింది. ఇప్పుడు ట్రెండ్ కావడం ఏమో గానీ ఈమె యాక్ట్ చేసిన పాత మూవీ క్లిప్స్ అన్నీ ఇప్పుడు వైరల్ చేస్తున్నాడు. ఇలా వైరల్ అయిన వీడియోల్లో సందీప్ కిషన్‌తో గిరిజ చేసిన రొమాంటిక్ సీన్ కూడా ఒకటుంది.
గిరిజ వ్యక్తిగత జీవితానికొస్తే.. తండ్రి గిరీష్ ఓకే కూడా నటుడే. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత థియేటర్స్‌లో చేరింది. తొలుత అడ్వర్టైజ్‌మెంట్స్ చేసి గుర్తింపు తెచ్చుకుని తర్వాత నటిగా మారింది. సుహ్రుద్ గోడ్బోలే అనే నిర్మాతని పెళ్లి చేసుకుంది. ఈమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఇన్నాళ్ల నుంచి సినిమాలు చేస్తున్నా 37 ఏళ్ల వయసులో ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతానని ఈమె కూడా అనుకుని ఉండదేమో?
(ఇదీ చదవండి: తిరుమలలో పెళ్లి చేసుకున్న 'కేజీఎఫ్' సింగర్)
Tags : 1