తెలంగాణలోనూ చిరంజీవి సినిమా టికెట్ ధరల పెంపు

Published on Sat, 01/10/2026 - 12:24

ప్రభాస్ 'రాజాసాబ్' చిత్రానికి తెలంగాణలో టికెట్ ధరలు పెంచినందుకే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు'కి పెంపు ఉంటుందా లేదా అని అందరూ మాట్లాడుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి జీవో వచ్చింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. 11వ తేదీన వేసే ప్రీమియర్ల ఒక్కో టికెట్ రూ.600గా నిర్ణయించారు.

(ఇదీ చదవండి: 'రాజాసాబ్' తొలిరోజు కలెక్షన్ అన్ని కోట్లా?)

అలానే 12వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు ఒక్కో టికెట్‌పై సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 'రాజాసాబ్'లానే దీనిపై కూడా ఎవరైనా న్యాయవాది పిటిషన్ వేసే అవకాశముంది. కాకపోతే ఈ రెండు రోజుల కోర్టు సెలవులు కాబట్టి సోమవారం నాడు ఇలాంటిది ఏమైనా ఉండే అవకాశముంది.

'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాలో చిరంజీవి, నయనతార జంటగా నటించారు. వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. భీమ్స్ సంగీతమందించగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కించారు.

(ఇదీ చదవండి: ఒక్కో డైరెక్టర్ ఒక్కోలా షాకిచ్చారు.. లేటెస్ట్‌గా 'రాజాసాబ్')

ఏపీలో జారీ చేసిన జీవో విషయానికొస్తే ముందు రోజు వేసే స్పెషల్‌ ప్రీమియర్‌ టికెట్‌ ధరని జీఎస్టీతో కలిపి రూ.500గా నిర్ణయించారు. జనవరి 11న రాత్రి 8గంటల నుంచి 10లోపు ఈ షోలు ఉంటాయి.

ఆపై తొలి పదిరోజులపాటు టికెట్‌ ధరలను పెంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతి వచ్చింది. సింగిల్‌ స్క్రీన్‌లలో టికెట్‌ ధరపై రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 జీఎస్టీతో కలిపి పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విడుదల మొదటిరోజు రాష్ట్రవ్యాప్తంగా 5 షోలు ప్రదర్శించవచ్చని జీఓలో పేర్కొంది.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)