Breaking News

తనకంటే ముందు చెల్లి పెళ్లి చేస్తున్న మరో హీరోయిన్!

Published on Wed, 12/03/2025 - 12:42

సాధారణంగా హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోరు. ఒకవేళ వీళ్లకు చెల్లి లేదా తమ్ముడు ఉంటే వాళ్లకు ముందుగా వివాహం చేసేస్తారు. త‍ర్వాత ఎప్పుడో టైమ్ చూసుకుని వీళ్లు కొత్త జీవితం ప్రారంభిస్తారు. గతంలో సాయిపల్లవి ఇలానే తనకంటే ముందు చెల్లి పెళ్లి చేసింది. ఇప్పుడు లిస్టులోకి మరో స్టార్ హీరోయిన్ చేరబోతున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: అత్తారింట్లోకి సామ్‌.. రాజ్‌ సోదరి ఎమోషనల్‌ పోస్ట్‌)

మహేశ్ బాబు 'వన్ నేనొక్కడినే' సినిమాతో హీరోయిన్ అయిన కృతి సనన్.. తర్వాత 'దోచేయ్' అనే మరో తెలుగు మూవీ చేసింది. ఈ రెండు ఫ్లాప్ అయ్యేసరికి బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. బాగానే పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం అడపాదడపా మూవీస్ చేస్తూ బిజీగానే ఉంది. ఈమె చెల్లి నుపుర్ కూడా నటినే. గతంలో ఆల్బమ్ సాంగ్స్‌లో యాక్ట్ చేసింది. రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సినిమా ఫెయిలైంది. ఈమె యాక్టింగ్ కూడా తేలిపోవడంతో తెలుగులో మరో ఆఫర్ రాలేదు. ప్రస్తుతానికైతే హిందీలో ఓ చిత్రంలో నటిస్తోంది.

అలాంటిది ఇప్పుడు నుపుర్ పెళ్లి చేసుకోనుందనే న్యూస్ బయటకొచ్చింది. రాజస్థాన్‌లోని ఉదయపుర్ వేదికగా ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని తెలుస్తోంది. సింగర్ స్టెబిన్ బెన్‌తోనే నుపుర్ కొత్త జీవితం ప్రారంభించనుందని టాక్. ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయని.. జనవరి 8,9 తేదీల్లో ఈ శుభాకార్యం జరగనుందని సమాచారం. ఈ వివాహ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు ఇండస్ట్రీకి చెందిన కొద్ది మంది మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. అయితే నుపుర్ లేదా స్టెబిన్ ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

(ఇదీ చదవండి: బుకింగ్‌ ఓపెన్.. ఆ విషయంలో టెన్షన్ పెడుతున్న 'రాజాసాబ్')

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)