జూ.ఎన్టీయార్‌...నా ప్రచార ‘యుద్ధం’ నాదే

Published on Thu, 08/07/2025 - 14:51

హీరోలు హీరోయిన్లు సినిమా ప్రచారంలో పాల్గొంటారే తప్ప ప్రచార బాధ్యతల్ని స్వయంగా చేపట్టడం అనేది జరగదు. సాధారణంగా ఆ బాధ్యతను కూడా సినిమా నిర్మాతలు, నిర్మాణ సంస్థలే చూసుకుంటాయి. అయితే గత కొంత కాలంగా  జూనియర్‌ ఎన్టీయార్‌ దీనికి కొంత విభిన్నంగా  ప్రయాణిస్తున్నారు. సినిమా నిర్మాణ సంస్థల ప్రచారపు తీరుతెన్నులు ఎలా ఉన్నప్పటికీ... తాను కూడా వ్యక్తిగతంగా మరోవైపు నుంచి వీటిని నిర్వహిస్తున్నట్టు సమాచారం. గతంలో రాజమౌళి రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రమోషన్‌ సమయంలో కూడా ఆయన ఇదే పంథాను అనుసరించారు. వ్యక్తిగతంగా అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని అంతర్జాతీయ స్థాయి లో ప్రచార వ్యూహాలు అమలు చేశారట.  ఆ సినిమా మల్టీ స్టారర్‌ అయినప్పటికీ జూ.ఎన్టీయార్‌(Jr NTR)కు వచ్చిన గుర్తింపు మరెవరికీ రాకపోవడానికి అదే కారణం అంటున్నారు. పలువురు హాలీవుడ్‌ దర్శకులు సైతం జూ.ఎన్టీయార్‌తో సినిమా చేయడానికి రెడీ అంటూ ప్రకటనలు గుప్పించిన సంగతి తెలిసిందే.

(చదవండి: నువ్వు తెలుగేనా? మంచు లక్ష్మితో అల్లు అర్హ క్యూట్‌ వీడియో)

తాజాగా వార్‌ 2 సినిమా విషయంలోనూ ఆయన ఇదే తరహా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. బాలీవుడ్‌  హీరో హృతిక్‌ రోషన్‌తో తొలిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్న టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌... వార్‌ 2 ని రూపొందించిన యష్‌ రాజ్‌ ఫిలింస్‌ ప్రచార శైలి పట్ల కినుక వహించారో, లేక తను కూడా మరింత బలం చేకూర్చాలనుకున్నారో తెలీదు గానీ ఈ సినిమా ప్రచారం విషయంలో ఎన్టీయార్‌ తన పిఆర్‌ టీమ్‌ను అలర్ట్‌ చేశారట. మరోవైపు తాజాగా సయ్యారా సినిమా సంచలన విజయం సాధించిన తర్వాత, ఆ సినిమాను కూడా  సమర్పించిన యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ భవిష్యత్తు  ప్రమోషన్‌ వ్యూహంలో కీలక మార్పులు చేశారని తెలుస్తోంది. 

(చదవండి: ఆ సీన్‌ చేయలేనని చెబితే.. సౌత్‌ స్టార్‌ హీరో నాపై కేకలు వేశాడు: తమన్నా)

సయ్యారా సినిమా మార్కెటింగ్‌ను ఈ సంస్థ అత్యంత వినూత్నంగా నిర్వహించింది.  ప్రధాన జంట ప్రమోషన్‌ కోసం చాట్‌ షోలు  షాపింగ్‌ మాల్స్‌లో డ్యాన్స్‌ ప్రోగ్రామ్స్‌ వంటివి చేయడానికి బదులుగా, సినిమా పాటలు  విజువల్‌ ప్రమోషన్ల ద్వారా మాత్రమే సినిమాపై ఆసక్తిని పెంచడం అనే కొత్త వ్యూహాన్ని ఈ సినిమా కోసం అవలంబించి విజయం సాధించారు.  ఈ పరిణామాల నేపథ్యంలో వార్‌ 2 ప్రచార సరళిలో కూడా ఈ సంస్థ కీలక మార్పు చేర్పులు చేసినట్టు సమాచారం. 

అయితే ఈ మార్పు చేర్పుల పట్ల అంతగా సంతృప్తి చెందని జూనియర్‌ ఎన్టీఆర్‌ తన చిత్రం ప్రమోషన్‌ బాధ్యతలను తానే స్వయంగా చేపట్టారట. యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ వారి మార్కెటింగ్‌ వ్యూహాన్ని వారు అనుసరిస్తున్నారని భావించిన ఎన్టీఆర్, తన వ్యక్తిగత మీడియా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మరో టాప్‌ హీరోతో కలిసి చేసే మల్టీ స్టారర్స్‌ విషయంలో జూ.ఎన్టీయర్‌ మరింత జాగ్రత్త పడుతున్నట్టుగా కనిపిస్తోంది.

ప్రతిష్టాత్మకంగా రూపొందిన వార్‌ 2 సినిమా ఆగస్టు 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో హృతిక్‌ రోషన్, జూనియర్‌ ఎన్టీఆర్‌ లాంటి స్టార్‌ హీరోలు నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అధికారిక ప్రమోషన్‌ కార్యక్రమాల్లో స్టార్స్‌ కనిపించకపోవచ్చుననే అంచనాలతో, అభిమానులు సోషల్‌ మీడియా  ఇతర మార్గాల ద్వారా ఈ సినిమా ప్రచారాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)