Breaking News

టాలీవుడ్‌లో ఎన్టీఆర్, సమంత టాప్‌..

Published on Sun, 05/15/2022 - 18:20

Jr NTR Samantha Tollywood Most Popular Actors As Per Ormax Media 2022: వివిధ సినీ ఇండస్ట్రీల్లో మోస్ట్‌ పాపులర్‌ నటులు ఎవరనే విషయంలో ప్రముఖ మీడియా కన్సల్టింగ్‌ సంస్థ 'ఓర్మాక్స్‌ మీడియా' (Ormax Media) ఒక సర్వే నిర్వహించింది. అందులో టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌లో మోస్ట్‌ పాపులర్‌, ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు ఎవరు అనే టాప్‌ 10 జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో టాలీవుడ్‌ నుంచి మోస్ట్‌ పాపులర్‌ నటుడిగా యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌, నటిగా స్టార్ హీరోయిన్‌ సమంత టాప్‌ 1 స్థానంలో నిలిచారు. తారక్‌ తర్వాత ప్రభాస్‌, అల్లు అర్జున్‌, రామ్ చరణ్‌, మహేశ్‌ బాబు, పవన్‌ కల్యాణ్‌, నాని, విజయ్‌ దేవరకొండ, చిరంజీవి, రవితేజ ఉన్నారు. 

ఇక హీరోయిన్ల విషయానికొస్తే.. సామ్‌ తర్వాత కాజల్ అగర్వాల్‌, అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్నా, తమన్నా, కీర్తి సురేశ్, సాయి పల్లవి, రకుల్‌ ప్రీత్‌ సింగ్, రాశీ ఖన్నా ఉన్నారు. వీరితోపాటు బాలీవుడ్‌​లో మోస్ట్‌ పాపులర్‌ హీరోగా అక్షయ్‌ కుమార్‌ మొదటి స్థానంలో నిలిచారు. తర్వాత షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌ ఉండగా చివరగా 10వ స్థానంలో వరుణ్ ధావన్‌ ఉన్నాడు. మోస్ట్‌ పాపులర్ హిందీ హీరోయిన్‌గా అలియా భట్‌ నిలిచింది. తర్వాత దీపికా పదుకొణె, కత్రీనా కైఫ్‌, కృతి సనన్‌ ఉండగా, చివరిగా అనుష్క శర్మ చోటు దక్కించుకుంది. 
 


తమిళంలో మోస్ట్‌ పాపులర్‌ హీరోయిన్‌గా ఫస్ట్‌ ప్లేస్‌లో నయన తార నిలిచింది. తర్వాత సమంత, కీర్తి సురేశ్‌, త్రిశ, జ్యోతిక, ప్రియాంక మోహన్‌, తమన్నా, రష్మిక మందన్నా, అనుష్క శెట్టి, హంసిక ఉన్నారు. ఆరో స్థానంలో నిలిచిన ప్రియాంక మోహన్‌ను ఆల్‌టైమ్‌ హైయెస్ట్‌ ర్యాంక్‌గా ప్రకటించింది ఓర్మాక్స్‌ మీడియా. ఇక హీరోల విషయానికొస్తే మొదటి స్థానంలో విజయ్‌ ఉండగా తర్వాత అజిత్, సూర్య, విజయ్‌ సేతుపతి, ధనుష్, శివకార్తికేయన్‌, రజినీ కాంత్, విక్రమ్‌, కమల్‌ హాసన్, శింబు నిలిచారు. 


హాలీవుడ్‌ హీరోయిన్లలో స్కార్లెట్‌ జాన్సన్‌, ఏంజిలీనా జోలీ, ఎమ్మా వాట్సన్, జెన్నిఫర్‌ లారెన్స్, గాల్‌ గాడోట్‌, ఎమ్మా స్టోన్, కేట్‌ విన్స్‌లెట్‌, ఎలిజబెత్‌ ఓల్సెన్‌, జెండయా, నటాలీ పోర్ట్‌మన్‌ వరుసగా ఉన్నారు. హీరోలలో టాప్‌ 1 ప్లేస్‌లో టామ్ క్రూజ్ ఉండగా, తర్వాతి స్థానాల్లో రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, డ్వేన్ జాన్సన్‌, విల్‌ స్మిత్, టామ్ హోలాండ్, లియనార్డో డికాఫ్రియో, క్రిస్‌ హెమ్స్‌వోర్త్‌, విన్‌ డీసిల్‌, క్రిస్ ఇవాన్స్‌, జానీ డెప్‌ నిలిచారు. 

Videos

New Movie: ఏకంగా ముగ్గురితో అల్లుఅర్జున్

ప్రభాస్ స్పిరిట్ కోసం ఈ ముగ్గురిలో ఎవరు..?

మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు

స్పిరిట్ నుండి దీపికా అవుట్..! సందీప్ వంగా దీపికాను ఎందుకు తీసివేశాడు..?

నంబాల కేశవరావు మృతదేహం అప్పగింతపై సందిగ్ధత

రాజధాని రివర్స్.. వద్దు మొర్రో అన్నా వినలేదు

అనకాపల్లి జిల్లా టీడీపీ మహానాడు సభ అట్టర్ ఫ్లాప్

విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం

మళ్లీ అదే తీరు దక్షిణాఫ్రికా అధ్యక్షుడి రమఫొసాతో ట్రంప్ వాగ్వాదం

స్కామ్ స్టార్ బాబు అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేసిన YS జగన్ మోహన్ రెడ్డి

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)