Breaking News

ఓటీటీలోకి లీగల్ కామెడీ మూవీ.. అధికారిక ప్రకటన

Published on Thu, 11/13/2025 - 15:35

ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వీకెండ్ కూడా అల తెలుసు కదా, కె ర్యాంప్, డ్యూడ్ లాంటి హిట్ చిత్రాలు రాబోతున్నాయి. వాటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వచ్చేశాయి. ఇప్పుడు లిస్టులో లేటెస్ట్ హిందీ మూవీ ఒకటి చేరింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ లీగర్ కామెడీ చిత్రం ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనే విషయాన్ని అనౌన్స్ చేశారు. ఇంతకీ ఎప్పటినుంచి ఎందులో చూడొచ్చు?

(ఇదీ చదవండి: రజనీకాంత్ 173వ సినిమా.. వారంలోనే తప్పుకొన్న దర్శకుడు)

గతంలో వచ్చిన జాలీ ఎల్ఎల్‌బీ, జాలీ ఎల్ఎల్‌బీ 2 సినిమాలకు కొనసాగింపుగా ఈ ఏడాదా సెప్టెంబరు 19న మూడో భాగం వచ్చింది. ఇందులో అక్షయ్ కుమార్, అర్షద్ వార్సి ప్రధాన పాత్రలు చేశారు. తొలి రెండు చిత్రాల్ని తీసిన సుభాష్ కపూర్.. దీన్ని కూడా డైరెక్ట్ చేశారు. 2011లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ వారం ప్రారంభంలోనే నవంబరు 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి రావొచ్చని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు అదే నిజమైంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. హిందీతో పాటు తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చే అవకాశముంది.

'జాలీ ఎల్ఎల్‌బీ 3' విషయానికొస్తే.. రాజస్థాన్‌లోని బికనీర్ గ్రామంలో ఓ ధనవంతుడైన పారిశ్రామికవేత్త హరి భాయ్ (గజరాజ్) చేసిన ఓ ప్రయత్నాన్ని ఊరిలోని వ్యవసాయదారులందరూ వ్యతిరేకిస్తారు. ప్రభుత్వాధికారులు తన చేతిలో ఉండేసరికి హరి భాయ్.. మతలబు చేసి రైతుల భూముల్ని తన సొంతం చేసుకుంటాడు. న్యాయం కోసం కోర్టుని ఆశ్రయించిన రైతులకు.. ఇద్దరు జాలీలు (అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ) ఎలాంటి సాయం చేశారు? చివరకు ఏమైందనేదే ఈ సినిమా స్టోరీ. తొలిరోజు చిత్రాలతో పోలిస్తే ఇది ఓ మాదిరి స్పందన మాత్రమే అందుకుంది. పెద్దగా కలెక్షన్స్ కూడా రాలేదు.

(ఇదీ చదవండి: ఎర్రకోట ఘటన.. 'పెద్ది' టీమ్ జస్ట్‌ మిస్!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)