Breaking News

ప్రెగ్నెంట్స్‌ని హింసించే ట్రెండ్.. నిజంగా ఇది అవసరమా?

Published on Tue, 10/20/2026 - 16:24

రీసెంట్ టైంలో థియేటర్లలోకి వచ్చిన ప్యారడైజ్, జైలర్ 2, రణబాలి సినిమాలు చూసుకుంటే వీటిలో ఒకేరకమైన సీన్స్ కామన్‌గా కనిపించాయి. అవే గర్భిణిలని హింసించడం. హీరోలకు ఎలివేషన్ ఇవ్వడం కోసమో, కథకు అవసరమనో ప్రెగ్నెంట్స్‌ని హింస పెట్టడం ఏదోలా అనిపించింది. దర్శకులు ఆలోచించుకోవాలి.. నిజంగా ఈ సన్నివేశాలు అవసరమా?

ఏ సినిమాల్లో అయినా ప్రెగ్నెంట్స్ కొంచెం కష్టపడుతున్నట్లు చూపిస్తేనే ఏదోలా ఉంటుంది. వాళ్లని ఎవరైనా కొట్టి, ఇబ్బంది పెట్టే సన్నివేశాలు వస్తే రకరకాలుగా అనిపిస్తుంది. అలాంటిది ఈ మధ్య అదేం పైత్యమో కానీ మన డైరెక్టర్లు గర్భిణిలను ఘోరాతి ఘోరంగా హింసించే సీన్లు పెట్టి ప్రేక్షకులకు నరకం చూపిస్తున్నారు.

(ఇదీ చదవండి: ‘ది ప్యారడైజ్‌’ మూవీ రివ్యూ)

నాని 'ప్యారడైజ్' సినిమానే తీసుకుంటే మొదలుపెట్టడమే డెలివరీకి రెడీగా ఉన్న నిండు గర్భిణిని, నడిరోడ్డు మీద బురదలో పడుకోబెట్టించారు. సరే ఏదో చేశారులే అనుకుంటే.. ఆమె పొట్టకు కరెంటు పెట్టించారు. ఆ మురికిలోనే డెలివరీ చేయించారు. హీరోకి ఎలివేషన్ ఇవ్వాలనే ఆలోచన మంచిదే గానీ ఇలా గర్బిణిని హింసించి మరీ ఎమోషన్ పిండుకోవాలనుకోవడం అవసరమా అధ్యక్షా? క్లైమాక్స్‌లోనూ మరో ప్రెగ్నెంట్స్‌కి గర్భిణికి నరకం చూపించే సీన్‌ మరింత ఇబ్బందిగా అనిపించింది.

'జైలర్ 2'లోనూ మూర్తి దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్న హీరో ముత్తవేల్ పాండియన్ నిజస్వరూపం బయటపడే సీన్ దగ్గర ఓ గర్బిణిని ఇద్దరు రౌడీలు బెత్తం పట్టుకుని హింసిస్తారు. ఇంకా ఏం చేస్తారో అనుకునేలోపు రజనీ వచ్చి సదరు రౌడీలని చంపేస్తాడు.

(ఇదీ చదవండి: ‘జైలర్‌ 2’ మూవీ రివ్యూ)

విజయ్ దేవరకొండ 'రణబాలి'లోనూ ఈ తరహా సన్నివేశముంది. నిండు గర్భిణిగా ఉన్న రష్మిక పాత్రకు పెట్టిన హింస వేరే లెవెల్. ఈ సీన్ చూసి తట్టుకోవడం సాధ్యం కాదు. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. స్టోరీకి తగ్గట్లే, సందర్భానుసారమే సీన్‌లో వయెలెన్స్‌ చూపించారు. ఎమోషన్ కుదిరింది కానీ ప్రేక్షకులకే రకరకాలుగా అనిపించింది.

పై సినిమాలు చూస్తున్నప్పుడు ఇలా ప్రెగ్నెంట్స్‌ని ఇబ్బంది పెట్టడానికి బదులు దర్శకులు.. వేరేలా ఎమోషన్ రాబట్టుకోవచ్చుగా అని ప్రేక్షకుడికి అనిపించకమానదు. ఎందుకంటే ఈ తరహా సీన్లు జుగుప్స కలిగిస్తున్నాయి. మొత్తం మూవీ చూసే అనుభూతినే దెబ్బ తీస్తున్నాయి. డైరెక్టర్స్.. ఇకనైనా ఇలాంటి వాటిని ఆపేస్తే బెటరేమో!

(ఇదీ చదవండి: ‘రణబాలి’మూవీ రివ్యూ)

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)