Breaking News

ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు

Published on Sun, 02/15/2026 - 17:33

ప్రతి వీకెండ్ ఓటీటీల్లోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా అలా మన శంకరవరప్రసాద్, అనగనగా ఒక రాజు, వనవీర తదితర తెలుగు మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. అలానే తలైవర్ తంబి తలైమయిల్, ద కంజూరింగ్, బ్యాండ్ వాలే లాంటి డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీసులు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు కూడా డిజిటల్ ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమైపోయాయి. పెద్దగా హడావుడి లేకుండా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇంతకీ అవేంటి? వేటిలో ఉ‍న్నాయి?

సాయిచరణ్, ఉషశ్రీ హీరోహీరోయిన్లుగా చేసిన తెలుగు సినిమా 'ఇట్స్ ఓకే గురు'. గత డిసెంబరు 12న థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న నటీనటులు కాకపోవడంతో ఇదెప్పుడు వచ్చివెళ్లిందనే విషయం కూడా తెలీదు. ఇప్పడీ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకుని చనిపోదామనుకున్న ఓ వ్యక్తి.. జీవితంలో అత్యున్నత శిఖరాలకు ఎలా వెళ్లాడు? ఈ ఎదుగులలో ప్రేమ ఎలాంటి పాత్ర పోషించింది అనేదే మూవీ స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)

ఇక డిసెంబరులోనే థియేటర్లలోకి వచ్చిన తెలుగు సినిమా 'పతంగ్'. ఇదివరకే సన్ నెక్స్ట్ ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు ఆహా లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ అంతా పతంగుల పోటీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. ప్రేమకథ సినిమాలు ఏమైనా చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. కాన్సెప్ట్ కూడా పర్లేదు బాగానే ఉందనిపించేలా ఉంటుంది.

గతేడాది తమిళంలో వచ్చిన హిట్ అయిన సినిమా 'గెవి'. ఇదివరకే సన్ నెక్స్ట్ ఓటీటీలోకి రాగా.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి కూడా వచ్చేసింది. అటవీ ప్రాంతంలోని ఓ ఊరిలో కొండచరియలు విరిగిపడటం, సరైన ఆస్పత్రి సౌకర్యాలు లేకపోవడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటారు. దీంతో అక్కడి ప్రజలు.. పోలీసులు, రాజకీయ నాయకులపై తిరగబడతారు. ఉద్యమం చేస్తారు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. షీలా, జాక్విలిన్ లిడియా ఇందులో ప్రధాన పాత్రలు చేశారు. ద‌యాల‌న్ దర్శకుడు.

(ఇదీ చదవండి: సోదరుడు లాంటి వ్యక్తి చనిపోయాడని రజనీకాంత్ సంతాపం)

Videos

Badvel : పేదల భూములు కొట్టేస్తున్న పచ్చ గద్దలు.. మాకు చావే గతి

చైర్మన్ పదవిపై జీవన్ రెడ్డి క్లారిటీ

కరీంనగర్ లో చక్రం తిప్పిన సీఎం రేవంత్.. సప్ప పడ్డ బీజేపీ..

శివరాత్రి ఉత్సవాల్లో RK రోజా

బూతులు తిట్టిన వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు... బాధితుడు అంబటి గారు జైల్లో ఉన్నారు

కొడుకు పెళ్లి సమయంలో వైరలవుతున్న సచిన్ లవ్ స్టోరీ

అంబటి రాంబాబు కుమార్తె మౌనికతో స్ట్రయిట్ టాక్

TDP: కోర్టుని లెక్కచేయకుండా.. రూ. 8000 కోట్లు మాయం

జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చే బాధ్యత నాది..

నేనే రాజు.. నేనే మంత్రి.. శృతిమించిన స్వాతిశయం

Photos

+5

కీసరగుట్టకు పోటెత్తిన భక్తజనం (ఫోటోలు )

+5

ప్రముఖ సినీతారల వాలైంటైన్స్ డే విషెస్ (ఫోటోలు )

+5

టాలీవుడ్ యాంకర్‌ మ్యారెజ్ డే.. భర్తలో లాస్య జ్ఞాపకాలు (ఫోటోలు )

+5

అరుదైన చీరల మేళవింపులో మహారాణిలా సోనమ్..! (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఫిబ్రవరి 15-22)

+5

బ్రహ్మమురారి.. సురార్చితలింగం (ఫొటోలు)

+5

సాహసం శ్వాసగా సాగిపో: విశాఖలో నేవీ విన్యాసాలు (ఫొటోలు)

+5

విశ్వక్‌సేన్‌ 'ఫంకీ' సక్సెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రావెల్‌ అడ్వెంచర్‌ టాక్‌ షో 'సోల్‌ ట్రిప్‌' (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో నరేశ్‌- పవిత్ర (ఫోటోలు)