Breaking News

హైకోర్టులో 'మన శంకరవరప్రసాద్' నిర్మాతకు నిరాశ

Published on Wed, 01/28/2026 - 08:26

ఇకపై సినిమా టికెట్ల ధరల పెంపు నిర్ణయం.. సినిమా విడుదలకు 90 రోజుల ముందే వెల్లడించాలని సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం నిరాకరించింది. మెరిట్స్‌ ఉంటే సింగిల్‌ జడ్జి వద్దే తేల్చుకోవాలని చెబుతూ అప్పీల్‌లో విచారణ ముగించారు.

(ఇదీ చదవండి: మలయాళ బ్లాక్‌బస్టర్.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులోనూ)

రీసెంట్‌గా 'మన శంకరవరప్రసాద్‌ గారు' సినిమాకు టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు హోంశాఖ జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ న్యాయవాది చంద్రబాబు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి.. ఇకపై సినిమా టికెట్ల ధరల పెంపు నిర్ణయం విడుదలకు 90 రోజులు ముందే ఉండాలని మధ్యంతర ఉత్తర్వులివ్వడంతోపాటు షైన్‌ స్క్రీన్‌ ఇండియా ఎల్‌ఎల్‌పీకి నోటీసులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ నిర్మాత షైన్‌ స్క్రీన్‌ ఇండియా ఎల్‌ఎల్‌పీ హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేసింది.

ఈ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌ ధర్మాసనం.. మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనికి ధర్మాసనం నిరాకరించింది. ఆ పిటిషన్‌పై ఇంకా విచారణ కొనసాగుతున్నందున అక్కడే వాదనలు వినిపించాలని ఆదేశిస్తూ విచారణ ముగించింది. దీంతో చిరంజీవి 'మన శంకరవరప్రసాద్' నిర్మాతకు నిరాశ ఎదురైంది.

(ఇదీ చదవండి: అనుకోని అవకాశం.. ఊహించిందే జరగబోతోంది!సాయిపల్లవితో ప్రభాస్)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)