మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!
Breaking News
‘సినిమా హిట్ అయ్యాకే బాలీవుడ్ నన్ను గుర్తించింది’
Published on Fri, 09/04/2026 - 17:14
బాలీవుడ్‌లో ఇటీవల విడుదలై అనూహ్య విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘హనుమాన్ అంశ్’ ఒకటి. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకుల ఆదరణతో క్రమంగా వసూళ్లను పెంచుకుంటూ దూసుకెళ్లింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశాల్ చతుర్వేది.
ఈ సినిమా మంచి విజయం సాధించడంతో మొదట్లో ఈ సినిమా కోసం వచ్చిన కష్టాలను విశాల్ వివరించారు. సినిమా విడుదలైన సమయంలో షోలు, థియేటర్ల సంఖ్య భారీగా తగ్గిపోయిందని.. ఆ సమయంలో బాలీవుడ్ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదని ఆయన పేర్కొన్నారు.
25 షోలకు పడిపోయాం
‘ఆగస్టు 7న విడుదలైన ఈ చిత్రానికి తొలుత దేశవ్యాప్తంగా 350కిపైగా షోలు దొరికాయి. ఇతర భారీ చిత్రాల విడుదలతో ఈ సినిమా షోల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే ప్రేక్షకులే ఈ సినిమాను నడిపించారు. పెద్ద సినిమాలు విడుదల కావడంతో మా షోలను థియేటర్లు తగ్గించాయి. ఒకానొక సందర్భంలో 250 షోల నుంచి 25 షోలకు పడిపోయాం. మల్టీప్లెక్స్‌లు కూడా ప్రధాన ప్రాంతాల్లో మా సినిమాను ప్రదర్శించేందుకు అంతగా ఆసక్తి చూపించలేదు’ అని విశాల్ తెలిపారు.
ఇదీ చదవండి: ఎయిర్‌హోస్ట్ నుంచి హీరోయిన్‌గా.. ఇదే రాశీ సింగ్ సక్సెస్ జర్నీ
ఆ పోస్టు ఇచ్చిన ధైర్యం..
‘సాధారణంగా పోస్టులను పెద్దగా పట్టించుకోను. కానీ ఆ సమయంలో నా సినిమా ఆడలేదేమోనని లోలోపల బాధపడుతున్నా. అప్పుడు ఒక పోస్ట్ కనిపించింది. ‘నీ పని నువ్వు చేయి.. మిగతాది నేను చూసుకుంటాను’ అనే సందేశం ఉంది. మొదటి వారం చివర్లో ఆ మాటలు నన్ను ఎంతో ప్రోత్సహించాయి’ అని ఆయన గుర్తుచేసుకున్నారు.
బాలీవుడ్ నుంచి సాయం..
‘హనుమాన్ అంశ్’తో పాటు ‘అవారాపన్ 2’, ‘బత్వారా’ చిత్రాలు థియేటర్లలోకి వచ్చాయి. సినిమా కష్టాల్లో ఉన్న సమయంలో హిందీ చిత్ర పరిశ్రమ నుంచి తాను ఆశించినంత మద్దతు లభించలేదని విశాల్ అన్నారు. ‘సినిమా విజయవంతం అయిన తర్వాత చాలామంది నాకు ఫోన్ చేసి అభినందించారు. కాగా రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం రూ.75 కోట్ల వసూళ్లకు చేరువలో ఉందని విశాల్ తెలిపారు. త్వరలోనే అంతర్జాతీయ స్థాయిలోనూ సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: ఓటీటీలు సోమరిపోతుల కోసమే: నటుడు శివాజీ
Tags : 1