Breaking News

ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసిన మెమొరీ కార్డ్ పోతే?

Published on Wed, 10/29/2025 - 17:49

ఒకప్పుడు పెళ్లంటే పెళ్లి మాత్రమే. ఇప్పుడు పెళ్లి అంటే అంతకంటే ముందు చాలా ఉంటాయి. అందులో ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకటి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్‌పై తెలుగులో ఓ కామెడీ సినిమా తీశారు. అదే 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'. మసూద మూవీ ఫేమ్ తిరువీర్ హీరోగా నటిస్తున్నాడు. టీనా శ్రావ్య హీరోయిన్. రాహుల్ శ్రీనివాస్ దర్శకుడు. నవంబర్ 7న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది బాగానే నవ్విస్తోంది.

(ఇదీ చదవండి: మహేశ్ ఫ్యామిలీ నుంచి 'ఏడుగురు' వారసులు)

ట్రైలర్ బట్టి చూస్తే.. పల్లెటూరిలో ఉండే హీరో ఓ ఫొటోగ్రాఫర్. ఓసారి ఓ జంటకు ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాడు. అనుకుని పరిస్థితుల్లో షూట్ చేసిన ఫుటేజీ ఉన్న మెమొరీ కార్డ్ పోతుంది. తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఈ గండం నుంచి హీరో ఎలా బయటపడ్డాడనేదే స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్ అయితే నవ్విస్తోంది. కామెడీ కూడా సహజంగా కుదిరింది. మరి మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి?

నవంబర్ 7న రష్మిక 'ద గర్ల్ ఫ్రెండ్', సుధీర్ బాబు 'జటాధర' చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితోపాటు ఈ సినిమా కూడా రానుంది. మరి మూడింటిలో ఏది ప్రేక్షకుల్ని అలరిస్తుందో చూడాలి. ఇదే తేదీన తమిళ డబ్బింగ్ బొమ్మ 'ఆర్యన్' కూడా తెలుగులో విడుదల కానుంది.

(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)