Breaking News

ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ హారర్ సినిమా

Published on Sun, 06/15/2025 - 14:50

మరో క్రేజీ హారర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకు తగ్గట్లే చాలా ఏళ్ల తర్వాత చివరి భాగాన్ని రిలీజ్ చేయగా, యావరేజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆ చిత్రం నెలలోనే డిజిటల్ స్ట్రీమింగ్‌ అయిపోతోంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో ఉంది?

(ఇదీ చదవండి: ఓటీటీలో మస్ట్ వాచ్ థ్రిల్లర్.. నరాలు తెగే ఉత్కంఠ.. 'స్టోలెన్' రివ్యూ)

సీక్వెల్స్, ఫ్రాంచైజీల ట్రెండ్ మన దగ్గర రీసెంట్ టైంలో బాగా పాపులర్ అయింది. కానీ హాలీవుడ్‌లో మాత్రం చాలా ఏళ్ల నుంచి ఈ ట్రెండ్ కొనసాగుతోంది. అలా 'ఫైనల్ డెస్టినేషన్' అనే భయానక చిత్రాల ఫ్రాంచైజీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చావులు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ సినిమాలో చూపిస్తారు. 2000లో తొలి భాగం రిలీజ్ కాగా.. 2003, 2006, 2009, 2011లో వరసగా నాలుగు చిత్రాలు రిలీజయ్యాయి. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నాయి.

ఈ ఫ్రాంచైజీలో భాగంగా చివరిదైన 'ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్' మూవీ.. గత నెల అంటే మే 16న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం ఇంకా ఆడుతోంది. అదే టైంలో ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రస్తుతం ఉత్తర అమెరికాలో అమెజాన్ ప్రైమ్‌, ఆపిల్ టీవీ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కాకపోతే అద్దె విధానంలో చూడొచ్చు. జూన్ 17 నుంచి అంటే ఈ మంగళవారం ఉదయం నుంచి మన దేశంలో రెంట్ విధానంలో స్ట్రీమింగ్ కానుంది. ఒకవేళ హారర్, భయానక చిత్రాలంటే ఇష్టముంటే దీన్ని ఓసారి ప్రయత్నించండి. వీలైతే ఒంటరిగానే చూడండి.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)