Breaking News

ఫిబ్రవరిలో టాలీవుడ్ పరిస్థితి ఏంటి?

Published on Tue, 02/03/2026 - 13:55

2026ని టాలీవుడ్ ఘనంగా ప్రారంభించింది. జనవరిలో చాలానే సినిమాలు రిలీజైనప్పటికీ చిరంజీవి 'మన శంకరవరప్రసాద్', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' చిత్రాలు ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. ఏడాదిని ఘనంగా మొదలుపెట్టాయి. మరి ఫిబ్రవరిలో టాలీవుడ్ పరిస్థితి ఏంటి? ఏయే చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి?

సంక్రాంతి సినిమాల హడావుడి వల్ల జనవరి మూడో, నాలుగో వారంలో చెప్పుకోదగ్గ మూవీస్ ఏం రాలేదు. చివరలో 'ఓం శాంతి శాంతి శాంతిః' అనే మూవీ వచ్చింది గానీ జనాలు అస్సలు పట్టించుకోలేదు. ఫిబ్రవరి తొలివారంలో మాత్రం ఏకంగా 10 వరకు తెలుగు స్ట్రెయిట్ చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో గుణశేఖర్ 'యుఫోరియా' మాత్రమే ఏమైనా వర్కౌట్ అవుతుందేమోనని అనిపిస్తోంది. దీనితో పాటు సుమతీ శతకం, శ్రీ చిదంబరం గారు, చాయ్ వాలా, హనీ, బ్లడ్ రోజెస్, ఆపరేషన్ పద్మ, బరాబర్ ప్రేమిస్తా లాంటి తెలుగు సినిమాలతో పాటు విత్ లవ్ అనే డబ్బింగ్ బొమ్మ కూడా తొలి వీకెండ్ థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి? 'ఆరెంజ్' చిత్రాన్ని ఇదేవారంలో రీ రిలీజ్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' టీజర్ వచ్చేసింది)

ఇకపోతే వాలంటైన్స్ డే వీక్ అయిన రెండోవారంలో విశ్వక్ సేన్ 'ఫంకీ', సంతోష్ శోభన్ 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాలతో పాటు సీతా పయనం అనే డబ్బింగ్ చిత్రం కూడా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. తమిళ సెన్సేషన్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' కూడా ఈ వీకెండ్‌లోనే రావొచ్చని అంటున్నారు కానీ సరైన క్లారిటీ అయితే లేదు. అలానే లవ్ స్టోరి, మనసంతా నువ్వే లాంటి రీ రిలీజులు కూడా ఇదే వారం థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి ప్రేమికుల ఓటు దేనికి వేస్తారో చూడాలి?

మూడో వారం సుహాస్ హీరోగా.. 'లిటిల్ హార్ట్స్' ఫేమ్ శివానీ హీరోయిన్‌గా చేసిన కామెడీ సినిమా 'హే భగవాన్' థియేటర్లలోకి రానుంది. టీజర్ అయితే బాగానే ఉంది. కాకపోతే రిలీజ్ తర్వాత హిట్టా? ఫట్టా అనేది తెలుస్తోంది. దీనితో పాటు 'చైనా పీస్' అనే తెలుగు మూవీ కూడా రాబోతోంది. ఈ వీకెండ్‌లోనే మృణాల్ ఠాకుర్ హిందీ మూవీ 'దో దివానే సెహర్ మే' రానుంది. రొమాంటిక్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. చివరి వారంలో ప్రస్తుతానికైతే 'స్క్రీమ్' అనే మూవీ మాత్రమే షెడ్యూల్ అయినట్లు సమాచారం. ఇప్పటికైతే ఫిబ్రవరిలో దాదాపు 20 మూవీస్ థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే వీటిలో దేనిపైనా పెద్దగా బజ్ అయితే లేదు. మరి ఏమైనా సర్‌ప్రైజ్ హిట్స్ అవుతాయేమో చూడాలి?

(ఇదీ చదవండి: మహేశ్‌కి నా గొంతు సూట్ అవ్వలేదు.. అందుకే ఫ్లాప్)

Videos

పోలీసులు లేకుండా రండి ఎవడి బలం ఏంటో తెలుస్తుంది

జైల్లో అంబటిని కలిసిన ముద్రగడ

అంబటి అల్లుడు,కూతురుని పరామర్శించిన అనిల్ కుమార్ యాదవ్

ఎవర్ని వదిలిపెట్టం.. బైరెడ్డి వార్నింగ్

KTR: 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? జాబ్ క్యాలెండర్ కు పాతర

మీకు దమ్ముంటే.. బాధితురాలి సంచలన సెల్ఫీ వీడియో..

Brahmaji : నావల్లే పూరి సినిమా ప్లాప్ అయ్యింది

Thanuja : ప్లీజ్ అలా అనడం మానేయండి.. నరకం అనుభవిస్తున్నా..

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఎయిర్ పోర్టులు

దేశం నుంచి వెళ్లిపోండి.. వాట్సాప్ కు సుప్రీంకోర్టు వార్నింగ్

Photos

+5

హీరోయిన్ జెనీలియా పెళ్లి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు (ఫొటోలు)

+5

'హనీ' ఈవెంట్‌లో అందంగా దివి (ఫొటోలు)

+5

'కపుల్ ఫ్రెండ్లీ' ట్రైలర్‌ ఈవెంట్‌ లో మెరిసిన హీరోయిన్‌ మానస వారణాసి (ఫొటోలు)

+5

నిర్మల్‌ : ఘనంగా ముజ్గి మల్లన్న జాతర (ఫొటోలు)

+5

’వెరైటీ ఇండియా పార్టీ‘లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)

+5

'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ధనుష్‌ 55వ సినిమా.. శ్రీలీల, సాయి పల్లవి క్రేజీ ఫోటోలు

+5

ఈషా రెబ్బా 'ఓం శాంతి' జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

దుబాయిలో చిల్ అయిపోతున్న దివ్య భారతి (ఫొటోలు)