Breaking News

ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ... తెలుగులోనూ

Published on Sun, 08/17/2025 - 14:44

సాధారణంగా స్పోర్ట్స్ డ్రామా సినిమాలంటే అంతంత మాత్రంగానే వర్కౌట్ అవుతుంటాయి. కొన్నిసార్లు మాత్రం బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాయి. అలా కొన్నాళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చిన ఓ హాలీవుడ్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్ని అలరించింది. రిలీజై దాదాపు నెలన్నర కావొస్తున్న ఇప్పటికీ ప్రేక్షకుల్ని రప్పిస్తోంది. అలాంటిది ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి రానుంది?

హాలీవుడ్ సినిమాలు అప్పుడప్పుడు చూసినా సరే నటుడు బ్రాడ్ పిట్ కాస్త పరిచయం ఉండే ఉంటాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఎఫ్ 1'. కార్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కించగా.. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తెలుగులోనూ రిలీజ్ చేయగా.. మన ఆడియెన్స్ కూడా చూసి ప్రశంసించారు. ఇప్పుడు ఈ చిత్రం ఆగస్టు 22 నుంచి అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీల్లో అందుబాటులోకి రానుంది.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)

'ఎఫ్ 1' విషయానికొస్తే.. ఫార్ములా వన్ రేసులో డ్రైవర్‌గా అదరగొట్టిన సన్నీ హెయస్ (బ్రాడ్ పిట్).. కెరీర్‌కి రిటైర్మెంట్ ఇచ్చి, వ్యాన్ డ్రైవర్ ‌ పనిచేస్తుంటాడు. అలా వయసు పైబడిన సన్నీకి ఏపీఎక్స్‌జీపీ (APXGP) అనే టీమ్‌లో రేసర్‌గా పనిచేయాలని అవకాశం ఇస్తారు. అయితే రేసింగ్ నుంచి తప్పుకొని చాలారోజులు అయిపోవడంతో సన్నీకి ఇప్పుడు చాలా సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా తన జట్టులోని యువకుడైన జోషువా పియర్స్ (డామ్సన్ ఐడ్రీస్) దూకూడు తట్టుకోవడం, అతడి నుంచి ఎదురైన అవమానాలు భరించడం కష్టంగా ఉంటుంది.

అసలు స్పానిష్ గ్రాండ్ ప్రీ రేసింగ్ తర్వాత సన్నీ.. ఎందుకు రేసింగ్ నుంచి తప్పుకొన్నాడు? మళ్లీ ఫార్ములా వన్ రేసింగ్ ట్రాక్‌ పైకి వచ్చిన సన్నీకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరకు విజేతగా నిలిచాడా లేదా అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఫహాద్ ఫాజిల్ కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)