ఓటీటీలో దురంధర్.. పాక్, బంగ్లాతో సహా ఏకంగా 22 దేశాల్లో..!

Published on Fri, 02/06/2026 - 20:22

రణ్‌వీర్ సింగ్‌ హీరోగా వచ్చిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ దురంధర్. గతేడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కేవలం హిందీలో మాత్రమే రిలీజై ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతేకాకుండా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. బాలీవుడ్ చిత్రాల జాబితాలో దేశవ్యాప్తంగా వెయ్యి కోట్లకు కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది.

టాప్‌లో ట్రెండింగ్..

థియేటర్లలో కేవలం హిందీలో మాత్రమే విడుదలైన ఈ సినిమా ఓటీటీలో దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి వచ్చేసింది. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ రికార్డుల మీద రికార్డ్స్ సృష్టిస్తోంది. గతంలో పలు అరబ్ దేశాలు ఈ మూవీపై నిషేధం విధించాయి. కానీ ఇప్పుడు అదే దేశాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు సౌదీ, యూఏఈ సహా ఏకంగా 22 దేశాల్లో టాప్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఈ జోరు చూస్తుంటే దురంధర్ దెబ్బ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది.

తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్విటర్ ద్వారా ప్రకటించింది. దురంధర్ ప్రభంజనం 22 దేశాల్లో కొనసాగుతోందని ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది. ఇండియాతో పాటు కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, మొరాకో, మారిషస్, నైజీరియా, బంగ్లాదేశ్, బహ్రెయిన్, హాంకాంగ్, జోర్డాన్, కువైట్, లెబనాన్, శ్రీలంక, మాల్దీవులు, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో టాప్‌లో కొనసాగుతోంది. దురంధర్ ఓటీటీకి వచ్చేసిన కేవలం 48 గంటల్లోనే గ్లోబల్‌గా టాప్‌-10లో అడుగుపెట్టేసింది. ప్రస్తుతం 32 దేశాల్లో టాప్‌-10లో కొనసాగుతోంది. థియేటర్లలో రిలీజ్ కాకుండా అడ్డుకున్న దేశాల్లో దురంధర్ టాప్‌లో కొనసాగడం విశేషం.

కాగా.. ధురంధర్‌లో రణవీర్ సింగ్ అండర్ కవర్ ఏజెంట్ హంజా అలీ మజారి పాత్రలో కనిపించారు. ఈ మూవీలో ఆర్ మాధవన్,  సంజయ్ దత్,  అక్షయ్ ఖన్నా,  అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రణ్‌వీర్ సరసన సారా అర్జున్ తొలిసారి హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. 

 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)