ఓటీటీకి దురంధర్‌-2.. ఆడియన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్

Published on Fri, 06/19/2026 - 11:42

రణ్‌వీర్ సింగ్ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో ఈ సినిమా ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం ఈ స్పై థ్రిల్లర్‌ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మొదట జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కొచ్చిన ఈ సినిమా.. నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోనూ అందుబాటులోకి వచ్చేసింది.

‍అయితే నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ ప్రియులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు మేకర్స్. ఇప్పటి వరకు మ్యూటెడ్‌ వర్షన్‌ మాత్రమే అందుబాటులో ఉంది.  ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అన్‌మ్యూటెడ్ వర్షన్‌ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సదుపాయం కేవలం ఓవర్‌సీస్‌ ప్రేక్షకులకు మాత్రమే అందుబాటులో ఉంది. నేటి నుంచి ఇండియన్స్‌ ఆడియన్స్‌కు కూడా అన్‌ మ్యూటెడ్ వర్షన్ చూసే అవకాశం దక్కింది. ప్రస్తుతం దురంధర్‌-2 హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో సారా అర్జున్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో సంజయ్ దత్, మాధవన్  కీలక పాత్రల్లో నటించారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)