'ధురంధర్' తెలుగు ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్

Published on Wed, 03/18/2026 - 15:15

'ధురంధర్' సినిమా గతేడాది డిసెంబరులో థియేటర్లలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. తర్వాత ఓటీటీలోకి వచ్చిన తర్వాత అదే రేంజ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తొలి భాగం విడుదలైన మూడు నెలలకు ఇప్పుడు సీక్వెల్ రెడీ అయిపోయింది. ముందే చెప్పినట్లు మార్చి 19నే అంటే రేపటి నుంచే మూవీని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే తెలుగు సినీ ప్రేక్షకులకు అనుకోని చేదువార్త ఎదురైంది.

(ఇదీ చదవండి: నోరు జారా.. క్షమించండి: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ నటుడు)

'ధురంధర్ 2' చిత్రం లెక్క ప్రకారం గురువారం(మార్చి 19) రిలీజ్ అవుతున్నప్పటికీ.. ముందు రోజు సాయంత్రం 5 గంటల నుంచే ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఉంటుందని ప్రకటించారు. అందుకు తగ్గట్లే టికెట్స్ కూడా విక్రయించారు. కానీ చివరి నిమిషంలో హడావుడి వల్ల తెలుగు, తమిళ ప్రింట్స్ టైంకి డెలివరీ కాలేదు. దీంతో బుధవారానికి సంబంధించి హిందీ వెర్షన్ మాత్రమే ప్రీమియర్స్ వేస్తున్నారు.

తెలుగు, తమిళ వెర్షన్స్.. బుధవారానికి సంబంధించిన షోలు రద్దయ్యాయి. డబ్బులు కూడా రీఫండ్ చేసేశారు. ఇకపోతే గురువారం ఉదయం నుంచి యధావిధిగా తెలుగు వెర్షన్ షోలు పడనున్నాయి. మరోవైపు దర్శకుడు ఆదిత్య ధర్.. మూవీ గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ట్విస్టులు బయటపెట్టొద్దని చెబుతూనే చివరి వరకు థియేటర్లలోనే ఉండాలని రాసుకొచ్చాడు. దీంతో మూడో భాగం గురించి హింట్ ఇస్తున్నాడా అని మాట్లాడుకుంటున్నారు.

'ప్రియమైన 'ధురంధర్' ఫ్యామిలీ.. సినిమాని మీరెంతో ప్రేమించారు. ప్రతి చిన్న అంశాన్ని గుర్తించి మెచ్చుకున్నారు. మళ్లీ మళ్లీ చూసి ఎవరూ గుర్తించలేరనుకునే వాటిని కూడా గుర్తించారు. ఈ ప్రయాణంలో సినిమా మీది అయింది. తర్వాత ప్రపంచానిది కూడా అయింది. 'ధురంధర్: ద రివేంజ్'తో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాం. భావోద్వేగానికి గురిచేస్తాం. రెడీగా ఉండండి. అందరితో కలిసి ప్రతి ట్విస్ట్, ఎమోషన్ థియేటర్ లోనే అనుభూతి చెందండి. దయచేసి సినిమా చూసిన తర్వాత ట్విస్టులని చెప్పేయకండి. ఎండ్ క్రెడిట్స్ అ‍య్యేంతవరకు సీట్ల నుంచి లేచి వెళ్లిపోకండి' అని డైరెక్టర్ ఆదిత్య ధర్ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: 'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి)

Videos

జగన్ నీకు చేసిన అన్యాయం ఏమిటి? షర్మిలపై కొండా రాఘవ రెడ్డి ఫైర్

విజయవాడ ఇఫ్తార్ విందులో YS జగన్

యూట్యూబ్ వైష్ణవి భర్త అరెస్ట్

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్‌

వక్ఫ్ భూముల జోలికొస్తే.. కూటమికి అంజాద్ బాషా వార్నింగ్

Ugadi: తెలుగు ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ ఉగాది శుభాకాంక్షలు

జగన్ ను కలిసిన HYD జర్నలిస్ట్, కె వెంకట్రామి రెడ్డి

ఇది నా న్యాయపోరాటంలో మొదటి అడుగు

ఇరాన్ 40ఏళ్ల ప్లానింగ్ వృధా.. ఒక్క క్షణంలో ముంచేసిన అమెరికా-ఇజ్రాయిల్..

జగన్ పాలనే బాగుంది YS షర్మిల సభలో రైతుల రియాక్షన్

Photos

+5

సాక్షి స్పెషల్.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు (ఫొటోలు)

+5

ఇఫ్తార్‌ విందు.. ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

ఫేమస్ వినాయక దేవాలయంలో మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ మాళవిక (ఫొటోలు)

+5

'ధురంధర్ 2' సినిమా.. HD ఫొటోలు

+5

సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్‌ (ఫొటోలు)

+5

అందంగా రాశీఖన్నా.. చీరలో క్యూట్ శ్రీలీల (ఫొటోలు)

+5

శ్రీశైలంలో ఉగాది జాతర..నల్లమలలో పాదయాత్రగా వెళ్తున్న కర్ణాటక భక్తులు (ఫోటోలు)

+5

నటి మంచు లక్ష‍్మి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)