Breaking News

నేను పూర్తిగా మారిపోయా.. విడాకుల అంశంపై ధనశ్రీ తొలిసారి

Published on Tue, 05/27/2025 - 14:26

టీమిండియా క్రికెటర్ చాహల్-ధనశ్రీ వర్మ విడాకుల అంశం ఇప్పటికీ ఏదోలా చర్చకు కారణమవుతూనే ఉంది. 2020లో ఈ జంట పెళ్లి చేసుకోగా కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నారు. కానీ ఏడాదిన్నర క్రితం విడాకుల రూమర్స్ వచ్చాయి. కట్ చేస్తే ఈ ఏడాది మార్చిలో అధికారికంగా విడిపోయారు. అప్పటినుంచి సైలెంట్‌గానే ఉన్న ఈమె.. ఇప్పుడు తొలిసారి మీడియాతో మాట్లాడింది. విడాకుల తర్వాత తాను చాలా మారిపోయినట్లు చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: Spirit: రూ. 20 కోట్లు డిమాండ్‌ చేసిన దీపికా.. త్రిప్తికి ఎంత ఇస్తున్నారంటే?) 

'ట్రోలింగ్ నన్నేం బాధపెట్టదు. ఎందుకంటే నాకు మనోబలం ఎక్కువ. బయట సమస్యలు నన్నేం చేయలేవు. నెగిటివిటీ, బహిరంగ విమర్శలు.. నన్ను ఎప్పుడూ బాధించలేదు. నేను చాలా కష్టపడే మనిషిని. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. నన్ను నేను ప్రేమించుకోవడం, క్రమశిక్షణ, వ్యాయామం, మంచి ఫుడ్‌తో పాటు నన్ను ప్రేమించే, గౌరవించే వ్యక్తులు నా చుట్టూ ఉన్నారు' అని ధనశ్రీ వర్మ చెప్పుకొచ్చింది.

రీసెంట్ టైంలో ఎదురైన పరిస్థితులు నన్ను దృఢంగా మార్చాయి. నా తల్లిదండ్రులు ఎంత బలమైన కూతుర్ని పెంచారో తెలిసొచ్చింది. ఇ‍ప్పుడు నాపై వస్తున్న పుకార్ల గురించి క్లారిటీ ఇవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడేం చెప్పినా అది మరింత చర్చకు కారణమవుతాయి. అలానే ప్రేమ అనేది జీవితంలో చాలా విలువైన అంశం అని ధనశ్రీ చెప్పింది.

(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన 'బిగ్‌బాస్' కాజల్)

చాహల్‌తో విడాకులు తీసుకోవడం ఏమో గానీ ధనశ్రీపై చాలా విమర్శలు వచ్చాయి. రూ.60 కోట్ల భరణం తీసుకుందని అన్నారు. కానీ అదంతా పుకారే అని తేల్చారు. మరోవైపు చాహల్‌తో చెట్టాపట్టాలేసుకున్న తిరుగుతున్న ఆర్జే మహ్‌వశ్ అనే అమ్మాయి కూడా అప్పుడప్పుడు పరోక్షంగా ధనశ్రీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసేది. ఇప్పుడు వాటిపైనే స్పందించిన ధనశ్రీ.. అలాంటివే పట్టించుకోనని క్లారిటీ ఇచ్చేసింది.

ప్రస్తుతం తెలుగులో 'ఆకాశం దాటి వస్తావా' అనే సినిమాలో హీరోయిన్‌గా చేసిన ధనశ్రీ వర్మ.. హిందీలో భోల్ చుక్ మాఫ్ అనే మూవీలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది. అంతకు ముందు ఈమె యూట్యూబర్‌గా చాలా ఫేమస్.

(ఇదీ చదవండి: ప్రియురాలితో అఖిల్ పెళ్లికి సిద్ధమయ్యాడా?)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)