Breaking News

ప్రియుడిని పరిచయం చేసిన తెలుగు సీరియల్ నటి

Published on Mon, 10/13/2025 - 15:54

తెలుగు సీరియల్ నటి గుడ్ న్యూస్ చెప్పేసింది. ఆమెనే 'జగద్ధాత్రి' సీరియల్ హీరోయిన్ దీప్తి మన్నె. పదిరోజుల క్రితం తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిన ఈమె.. ఇప్పుడు ప్రియుడిని పరిచయం చేసింది. ఇద్దరు జంటగా, రొమాంటిక్‌గా దిగిన ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తోటీ నటీనటులు ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇంతకీ దీప్తి ప్రియుడు ఎవరు?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు)

తెలుగులో సీరియల్స్ అనగానే కన్నడ నటులే గుర్తొస్తారు. అలాంటి వాళ్లలో దీప్తి మన్నె ఒకరు. బెంగళూరులో పుట్టిన ఈ బ్యూటీ తొలుత కన్నడలో సీరియల్స్, సినిమాలు చేసింది. తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. గత కొన్నేళ్లలో 'రాధమ్మ కూతురు', 'జగద్ధాత్రి', 'పద్మావతి' తదితర సీరియల్స్ చేసింది. ఇక సెలవ్ అనే తెలుగు మూవీతో పాటు యెవన్, దేవదాస్ బ్రదర్స్, కర్త, హింగ్యాకే, నమ్మూర హైక్లు అనే కన్నడ చిత్రాల్లో నటించింది.

ప్రస్తుతం తాను రోహన్‌తో ప్రేమలో ఉన్నానని దీప్తి.. ఇన్ స్టా వేదికగా బయటపెట్టింది. ఇతడికి ఇండస్ట్రీతో సంబంధం లేనట్లు తెలుస్తోంది. 'డియర్ రోహన్. నీ కోసమే ఇన్నాళ్లుగా నేను ఎదురుచూస్తున్నాను. నాకు దక్కిన మరపురాని బహుమతి నువ్వు. నన్ను కోరుకున్నందుకు థ్యాంక్యూ. ఐ లవ్ యూ' అని ప్రియుడి గురించి దీప్తి చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికైతే పరిచయం చేసింది. త్వరలో నిశ్చితార్థం, పెళ్లి ఉండొచ్చని తెలుస్తోంది. బహుశా ఈ ఏడాది పూర్తయ్యేలోపు శుభకార్యాలు చేస్తారేమో!

(ఇదీ చదవండి: నిజ జీవితంలో అమ్మాయిల పిచ్చి ఉందా?.. సిద్ధు షాక్‌!)

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)