Breaking News

6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా

Published on Wed, 05/14/2025 - 10:23

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. స్టార్ హీరోలు, యంగ్ హీరోల నటించిన చిత్రాలు వీలైనంత త్వరగా వచ్చేస్తాయి. కానీ కొన్ని చిన్న మూవీస్ కి మాత్రం చాన్నాళ్లకు స్ట్రీమింగ్ అవుతుంటాయి. ‍అలా ఓ తెలుగు సినిమా దాదాపు ఆరు నెలల తర్వాత సడన్ గా వచ్చేసింది.

గతేడాది నవంబర్ లో రిలీజైన తెలుగు మూవీ 'సినిమా పిచ్చోడు'. కుమారస్వామి హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. పెద్దగా ఆకట్టుకోని స్టోరీ, తక్కువ బడ్జెట్ తో తీసిన చిత్రం కావడంతో థియేటర్లలోకి వచ్చి వెళ్లిన సంగతి కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది.

(ఇదీ చదవండి: రోజుకు రూ.20 జీతానికి పనిచేశా.. హీరో ఎమోషనల్ వీడియో

సినిమా పిచ్చోడు విషయానికొస్తే.. జోష్ అలియాస్ కుమారస్వామి గ్రామంలో పాలు అమ్ముతుంటాడు. కానీ సినిమాలంటే పిచ్చి. అందుకే ఊరిలో వాళ్లని పేరుతో కాకుండా సినిమా పేర్లతో పిలుస్తుంటాడు. ఓసారి భాను.. డెమో ఫిల్మ్ తీసేందుకు జోష్ ఉంటున్న ఊరికి వస్తుంది. ఈ క్రమంలో అనుకోకుండానే జోష్ కి నటించే అవకాశమొస్తుంది. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే.. మరణమాస్, భోల్ చుక్ మాఫ్, నెసిప్పయ అనే సినిమాలు రాబోతున్నాయి. గత వీకెండ్ లో రాబిన్ హుడ్, గుడ్ బ్యాడ్ అగ్లీ, జాక్, ఓదెల 2, కాలమే కరిగింది తదితర తెలుగు చిత్రాలు వచ్చాయి. ఈ వీకెండ్ మరి ఏమేం తెలుగు మూవీస్ ఓటీటీలోకి వస్తాయో చూడాలి?

(ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు