మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. కానీ

Published on Fri, 05/16/2025 - 13:52

ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తుంటాయి. కొన్నిసార్లు థియేటర్లలో రిలీజైన కొన్ని వారాలకే స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. ఇప్పుడు కూడా ఓ తెలుగు మూవీ అలానే ఓటీటీలోకి వచ్చింది. కాకపోతే ఇక్కడే ఓ ట్విస్ట్. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది?

గత నెల 24న థియేటర్లలో రిలీజైన తెలుగు మూవీ 'చౌర్యపాఠం'. బ్యాంక్ దొంగతనం నేపథ్య కథతో తీశారు. బాగానే ప్రమోట్ చేశారు కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మూడు వారాలకే ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ప్రస్తుతం ఓవర్సీస్ (విదేశాల్లో) తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

(ఇదీ చదవండి: ఈ రోజుని ఎప్పటికీ గుర్తుంచుకుంటా.. అనసూయ పోస్ట్ వైరల్) 

బహుశా వచ్చే వారం మన దేశంలో తెలుగు వెర్షన్ అందుబాటులోకి రావొచ్చు అనిపిస్తుంది. ప్రముఖ దర్శకుడు నక్కిన త్రినాథరావు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. నిఖిల్ దర్శకత్వం వహించాడు. ఇంద్ర‌రామ్‌, పాయ‌ల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లు కాగా మ‌స్త్ అలీ, రాజీవ్ క‌న‌కాల కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 

చౌర్యపాఠం విషయానికొస్తే.. వేదాంత్ రామ్(ఇంద్రరామ్)కి దర్శకుడు కావాలనేది కల. నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోయేసరికి బ్యాంక్ దొంగతనం చేసి ఆ డబ్బులతో సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు. ‍బబ్లూ, జాక్ డాన్ అనే ఇద్దరిని తన ప్లాన్ లో భాగం చేస్తాడు. అదే బ్యాంకులో పనిచేస్తున్న అంజలి(పాయల్ రాధాకృష్ణ) వీళ్లకు తోడవుతుంది. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)