Breaking News

బ్రో మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

Published on Fri, 07/28/2023 - 14:10

టాలీవుడ్‌ హీరోలు పవన్‌ కల్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన మల్టీస్టారర్‌ బ్రో. తమిళంలో సూపర్‌ హిట్‌ సాధించిన వినోదయ సీతం చిత్రానికి ఇది రీమేక్‌ అన్న విషయం  అందరికీ తెలిసిందే! మాతృకకు దర్శకత్వం వహించిన సముద్రఖని ఈ సినిమాకు కూడా డైరెక్షన్‌ చేశాడు. తెలుగు నేటివిటికీ తగ్గట్టు చాలా మార్పులే చేశాడు. జూలై 28న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు సోషల్‌ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. డైరెక్టర్‌ కథను పక్కన పెట్టి పవన్‌ను హైలైట్‌ చేయడంపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టాడన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఈజీగా నచ్చుతుంది కానీ అందరినీ మెప్పించడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇకపోతే ఏ సినిమా అయినా థియేటర్‌లో రిలీజైన కొంతకాలానికి ఓటీటీలో రావడం పక్కా! అందుకు బ్రో కూడా అతీతం కాదు. ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. థియేటర్‌లో రిలీజైన నాలుగు వారాలకే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఈ లెక్కన బ్రో మూవీ కూడా ఆగస్టు నెలాఖరులో లేదంటే సెప్టెంబర్‌ మొదటి వారంలో ఓటీటీలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

బ్రో సినిమా విషయానికి వస్తే.. ఇందులో పవన్‌, సాయిధరమ్‌ తేజ్‌తో పాటు కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం తదితరులు నటించారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ స్క్రీన్‌ప్లే, మాటలు అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. తమన్‌ సంగీతం అందించగా నవీన్‌ నూలి ఎడిటర్‌గా వ్యవహరించాడు.

చదవండి: బిగ్‌బాస్‌ కీర్తి ఎంగేజ్‌మెంట్‌ ఫిక్స్‌

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?