Breaking News

సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా

Published on Sat, 08/23/2025 - 14:58

మిస్టరీ, థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. మరోవైపు చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజైనప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఒకవేళ ఓటీటీలోకి వస్తే మాత్రం టైమ్ పాస్ కోసం అలా చూస్తుంటారు. ఇప్పుడు సినీ ప్రేమికుల కోసం అలాంటి ఓ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. దాదాపు ఏడాది తర్వాత స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఏంటా సినిమా?

గతేడాది ఆగస్టు 23న థియేటర్లలో రిలీజైన తెలుగు మూవీ 'బ్రహ్మవరం పీఎస్ పరిధిలో'. గురు చరణ్, సూర్య శ్రీనివాస్, స్రవంతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలోకి వచ్చినప్పుడు పర్లేదనిపించే రెస్పాన్స్ అందుకుంది. మరోవైపు స్టార్స్ ఎవరూ లేకపోవడంతో దీనికి పెద్దగా ఆదరణ దక్కలేదు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఆసక్తి ఉంటే ఓ లుక్కేయొచ్చు.

(ఇదీ చదవండి: అనిరుధ్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌)

'బ్రహ్మవరం పీఎస్ పరిధిలో' విషయానికొస్తే.. చైత్ర (స్ర‌వంతి బెల్లంకొండ‌) అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌. తాను ఇష్ట‌ప‌డ‌టం కంటే త‌న‌ని ప్రేమించే కుర్రాడు తనకు భర్తగా రావాలని కోరుకుంటుంది. సూర్య‌లో (సూర్య శ్రీనివాస్‌) అలా కనిపించేసరికి అతడితో ప్రేమలో పడుతుంది. గౌత‌మ్ (గురుచ‌ర‌ణ్‌) ఓ జులాయి. ఇతడి తండ్రి ప‌ట్టాభి పోలీస్ కానిస్టేబుల్‌. త‌న క‌ళ్ల ఎదుట త‌ప్పు జ‌రిగితే గౌత‌మ్ స‌హించ‌లేడు.

ఓ సందర్భంలో బ్ర‌హ్మ‌వ‌రం ఎస్ఐని ఎదురించిన గౌతమ్.. అత‌డికి శ‌త్రువుగా మారుతాడు. అనుకోకుండా ఓ రోజు బ్ర‌హ్మ‌వ‌రం పోలీస్ స్టేష‌న్‌ దగ్గరలో ఓ శవం దొరుకుతుంది. ఆ కేసు సంచ‌లనంగా మారుతుంది. దీంతో పోలీసులు విచారణ మొదలుపెడతారు. సరిగ్గా అదే సమయంలో గౌత‌మ్‌ని క‌ల‌వ‌డం కోసం చైత్ర, అమెరికా నుంచి స్వదేశానికి వస్తుంది. ఆ శవానికి చైత్ర‌, గౌత‌మ్‌ల‌కు సంబంధమేంటి? హంతుకుడు దొరికాడా లేదా అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ప్రేమ కోసం లండన్ నుంచి చెన్నై.. విజయ్ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలుసా?)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)