Breaking News

ఓటీటీకి పూజా హెగ్డే డిజాస్టర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

Published on Thu, 03/27/2025 - 16:10

బుట్టబొమ్మ పూజా హెగ్డే, బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌ జంటగా నటించిన చిత్రం దేవా. రోషన్‌ ఆండ్రూస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 31న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి ఆదరణ కరవైంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా వచ్చిన దేవా అభిమానులను థియేటర్లలో రప్పించడంలో విఫలమైంది.

అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఈనెల 28 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ఈ మేరకు దేవా పోస్టర్‌ను పంచుకుంది.

కాగా..2013లో మలయాళంలో 'ముంబై పోలీస్' అనే పేరుతో ఓ సినిమా వచ్చింది. అప్పట్లో ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. అదే సినిమాని తెలుగులో 'హంట్' పేరుతో సుధీర్ బాబు రీమేక్ చేశాడు. ఇక్కడ అంతగా వర్కవుట్ కాకపోవడంతో ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమానే మళ్లీ హిందీలో షాహిద్ కపూర్ హీరోగా 'దేవా' పేరుతో తెరకెక్కించగా డిజాస్టర్‌గా నిలిచింది. మరీ ఓటీటీలోనైనా అభిమానులను ఏమేర అలరిస్తుందో వేచి చూడాలి.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)