Breaking News

ఇమ్మాన్యుయేల్‌పై మాస్క్‌ మ్యాన్‌ దారుణ కామెంట్స్‌.. బాడీ షేమింగ్‌ కూడా!

Published on Sat, 09/13/2025 - 09:30

బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu 9) హౌస్‌ అంతా ఆమెకు వ్యతిరేకంగా నిలిచింది. 14 మంది ఒకవైపు ఉంటే, సంజనా ఒక్కరే మరోవైపు నిలబడింది. కొన్నిసార్లు ముక్కుసూటిగా మాట్లాడుతుంది, మరికొన్నిసార్లు అమాయకంగా ముఖం పెడుతుంది. ఒక్కోసారి తనపై నోరుపారేసుకున్నవారిపై ఒంటికాలిపై లేస్తుంది. ఏదేమైనా బిగ్‌బాస్‌ షోకి కావాల్సిన కంటెంట్‌ మాత్రం బాగానే ఇస్తుంది. ఇప్పుడేకంగా ఫస్ట్‌ కెప్టెన్‌గా నిలిచింది.

సత్తా చూపించిన రాము
అయితే ఈ కెప్టెన్సీ టాస్క్‌లో కామనర్లు అతి చేశారు. పవన్‌ కల్యాణ్‌ ఓటమిని ఒప్పుకోకుండా అడ్డంగా వాదించాడు. హరీశ్‌.. నేను వేరే వాళ్లలా గెంతులు వేయను అంటూ పరోక్షంగా ఇమ్మాన్యుయేల్‌పై సెటైర్లు వేశాడు. ఎవరూ శ్రీజ నిల్చున్న రాడ్స్‌ తీసేయకపోవడంతో చివరకు తను గెలిచింది. కానీ, ఎక్కువ కష్టపడి సత్తా చూపించింది మాత్రం రాము రాథోడ్‌! సంజనాకోసం ఆడిన శ్రీజ గెలవడంతో సంజనా కెప్టెన్‌ అయింది.

బాడీ షేమింగ్‌
నేను కామనర్లతోనే ఎక్కువ కలిసిపోతే వాళ్లు ఎన్ని మాటలంటున్నారు? నన్ను బాడీ షేమింగ్‌ చేశారు. ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నారు అని ఇమ్మాన్యుయేల్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెప్టెన్‌ సంజనా.. తన లగేజీకి రూమ్‌లోకి షిఫ్ట్‌ చేయమని ఫ్లోరాకి చెప్తే తను చేయనని తెగేసి చెప్పింది. దీని పర్యవసానాలు ఏంటో రేపు చెప్తా అని సంజనా వార్నింగ్‌ ఇచ్చింది. మరోవైపు కెప్టెన్‌ కోసం బిగ్‌బాస్‌ చాక్లెట్లు, చిప్స్‌ పంపిస్తే.. కామనర్లు ప్రియ, శ్రీజ వాటిని కొట్టేశారు. 

ముగ్గురు ఆడోళ్లు
ఒక్క గుడ్డు తిన్నందుకు ఆమెను రెండురోజులపాటు ఇంట్లోకే రావద్దన్న వీళ్లు ఇప్పుడేకంగా కెప్టెన్‌ లగ్జరీనే కొట్టేయడం గమనార్హం. అటు హరీశ్‌.. తనూజ, భరణి, ఇమ్మాన్యుయేల్‌.. ఒకమ్మాయి, ఇద్దరు మగాళ్లు అనుకున్నా.. కానీ వాళ్లు ముగ్గురు ఆడోళ్లని ఇప్పుడే తెలిసింది. ముగ్గురు ఆడాళ్లతో ఫైట్‌ చేస్తున్నానని అర్థమైంది అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. కామనర్స్‌ అందరూ కూడా సెలబ్రిటీలను చులకనగానే చూస్తున్నారు.

దొంగతనం చేసిన మాస్క్‌ మ్యాన్‌
కెప్టెన్‌ సంజనా హౌస్‌మేట్స్‌కు బంపరాఫర్‌ ఇచ్చింది. తనను ఇంప్రెస్‌ చేస్తే కూల్‌డ్రింక్‌ ఇస్తానంది. నువ్విచ్చేదేంటి? అనుకున్నాడో, ఏమో కానీ హరీశ్‌ ఓ కూల్‌డ్రింక్‌ లేపేశాడు. ఇక సంజనను ఇంప్రెస్‌ చేసేందుకు అందరూ స్కిట్‌ చేశారు. స్కిట్‌ చేసిన వాళ్లలో ఫలానా వాళ్లు బెస్ట్‌ అంటూ ప్రకటించింది. కానీ, అందరికీ కూల్‌డ్రింక్‌ ఇచ్చేముందు ఓ కూల్‌డ్రింక్‌ ఎవరు లేపేశారో చెప్పాలంది. మరి హరీశ్‌ దాన్ని బయటపెడతాడా? లేదా? చూడాలి!

Videos

Appalaraju: ప్రభుత్వ ఆస్తులను చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా ఇస్తున్నారు

చంద్రబాబు బిస్కెట్ల కోసం బరితెగించిన ఈనాడు పత్రిక

మిజోరం రాజధానికి కొత్త రైల్వే లైన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

మంత్రి నారాయణకు బిగ్ షాక్ డయేరియా బాధితుల ఫ్యామిలీ నిలదీత

YSRCP ఎప్పుడూ విజన్ తో ఆలోచిస్తుంది..విజయవాడ-గుంటూరు మధ్య పెడితే..: సజ్జల

రాజధానిపై చంద్రబాబు హాట్ కామెంట్స్

బరువెక్కుతున్న అమీర్..! కారణం అదేనా..?

RK Roja: మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది

ఈ వయసులో నీకెందుకు బాబు.. జూ.ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు ఇచ్చేయ్

Diarrhea Cases: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 106 మంది

Photos

+5

వింటేజ్ లుక్స్ లో ఫరియా అబ్దుల్లా నెట్టింట ఫొటోలు వైరల్

+5

రూ.2,700 కోట్ల విలాసం... కానీ తక్కువ ధరకే!! (ఫొటోలు)

+5

మాల్దీవుస్‌లో 'డిజే టిల్లు' బ్యూటీ.. నేహా శెట్టి ఫోటోలు చూశారా?

+5

హైదరాబాద్‌లో తప్పక సందర్శించాల్సిన ఆలయాలు ఇవిగో (ఫొటోలు)

+5

‘అందెల రవమిది’ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ఆరెంజ్‌ డ్రెస్‌లో అందంగా ఐశ్వర్య రాజేశ్‌ (ఫోటోలు)

+5

యాపిల్ సీఈఓతో అమితాబ్ బచ్చన్ మనవరాలు (ఫొటోలు)

+5

'మిరాయ్'తో మరో హిట్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ నటి సుధ, అనిరుధ్, సప్తగిరి (ఫొటోలు)