Breaking News

హీరో ప్రదీప్‌ డేంజర్‌ అన్న బ్యూటీ.. బిగ్‌బాస్‌ స్టేజీపై దివ్వెల మాధురి డ్యాన్స్‌

Published on Sun, 10/12/2025 - 16:54

బిగ్‌బాస్‌ షో (Bigg Boss Telugu 9) మొదలై నెల రోజులవుతోంది. మొదట్లో ఊపు మీదున్న షో తర్వాత కాస్త గాడితప్పింది. దీంతో బిగ్‌బాస్‌ షోకు సరికొత్త హంగామా తీసుకొచ్చేందుకు వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్లను దింపుతున్నారు. ఈ రోజు రాత్రి ఆరుగురు సెలబ్రిటీలు హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తాజాగా ప్రోమో రిలీజ్‌ చేశారు. వైల్డ్‌ కార్డ్స్‌ చాలా వైల్డ్‌గా ఉంటాయని హెచ్చరించాడు నాగ్‌. తమిళ, కన్నడ, మలయాళ బిగ్‌బాస్‌ల హోస్ట్‌లతోనూ నాగ్‌ ముచ్చటించాడు. డ్యూడ్‌ సినిమా హీరోహీరోయిన్‌ ప్రదీప్‌ రంగనాథన్‌, మమిత బైజు స్టేజీపైకి అతిథులుగా విచ్చేశారు. 

ప్రదీప్‌ చాలా డేంజర్‌
పనిలో పనిగా రెండు స్టెప్పులు కూడా వేశారు. ఈ సందర్భంగా.. ప్రదీప్‌ ప్రమాదకరమైన వ్యక్తి అని నాగార్జునకు కంప్లైంట్‌ చేసింది మమిత. అది విని అవాక్కైన ప్రదీప్‌.. నేనేం చేశాను? అని నోరెళ్లబెట్టాడు. అందుకు మమిత చిరునవ్వుతోనే అయినా నువ్వు కొంచెం డేంజరసే అని మరోసారి నొక్కి చెప్పింది. ఇక ఈరోజు ఎపిసోడ్‌లో దివ్వెల మాధురి, రమ్య మోక్ష, శ్రీనివాస్‌ సాయి, నిఖిల్‌ నాయర్‌, గౌరవ్‌ గుప్తా, ఆయేషా జీనత్‌లు హౌస్‌లో అడుగుపెట్టనున్నారు. దివ్వెల మాధురి డ్యాన్స్‌ పర్ఫామెన్స్‌ ఇచ్చినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. మరి మిగతావాళ్ల ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి!

 

చదవండి: బిగ్‌బాస్ 9లో అందరూ ఓవర్ యాక్షన్.. నేనేంటో చూపిస్తా: మాధురి

Videos

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)